కేంద్రం గుడ్ న్యూస్ - ఇక 5 గంటల్లో హైదరాబాద్ టు బెంగళూరు వయా ఏపీ..!!
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి ఏపీ మీదుగా బెంగళూరుకు హైస్పీడ్ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ నిర్మాణం పైన కీలక నిర్ణయం జరిగింది. ఏపీలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల మీదుగా ఈ కారిడార్ ఖరారైంది. ఇప్పుడున్న హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి-44కు సమాంతరంగా దీనిని నిర్మించనున్నారు. ఇందు కోసం తాజాగా డీపీఆర్ సిద్ధం చేసారు. ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే ఇక హైదరాబాద్ నుంచి బెంగళూరు కు అయిదు గంటల్లోనే చేరుకునే అవకాశం కలుగుతుంది.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వయా ఏపీ జిల్లాల గ్రీన్ ఫీల్డ్ కారిడార్ పైన వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ కారిడార్ కోసం మూడు ఎలైన్‌మెంట్లు తయారు చేస్తున్నారు. వీటిలో ఒకదానిని జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్) ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదించనుంది. ప్రస్తుతం ఎన్‌హెచ్-44పై ప్రయాణించి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరేందుకు 8-9 గంటలు పడుతోంది. కొత్తగా నిర్మించనున్న హైస్పీడ్ కారిడార్ మీదుగా ప్రయాణం చేయటం ద్వారా అయిదు గంటల్లోనే హైదరాబాద్ నుంచి బెంగళూరు కు చేరుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 120 కి.మీ. వేగంతో వాహనాలు పరుగులు పెట్టేలా డిజైన్ రూపొందిస్తున్నారు.

కాగా, ఇప్పుడున్న ఎన్‌హెచ్-44నే నాలుగు వరుసలు నుంచి ఆరుగాని, ఎనిమిది వరుసలకుగాని విస్తరించాలని తొలుత భావించారు. హైదరాబాద్-బెంగళూరు హైవే-44 తెలంగాణలో 210 కి.మీ., ఏపీలో 260 కి.మీ., కర్ణాటకలో 106 కి.మీ. మేర కలిపి మొత్తం 576 కి.మీ.ఉంది. కొత్త హైస్పీడ్ కారిడార్ కూడా ఎన్‌హెచ్-44కు 10-15 కి.మీ. దూరంలో దాదాపు సమాంతరంగా వెళ్లనుంది. అయితే, కొన్నిచోట్ల మాత్రమే ఈ హైవేలోకి ప్రవేశించేందుకు (ఎంట్రీ), బయటకు వచ్చేందుకు (ఎగ్జిట్) అవకాశం కల్పిస్తారు. కారిడార్ మధ్య ఎక్కడైనా ఇతర ఎన్‌హెచ్‌లను క్రాస్ చేస్తే అక్కడ ట్రంపెట్ ఇంటర్ ఛేంజ్‌లు నిర్మిస్తారు. కారిడార్ మొత్తం నాలుగైదు మీటర్ల ఎత్తులో ఉండనుంది. దీనిపై అడ్వాన్స్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ విధానం అమలు చేయనున్నారు. ఏపీ పరిధిలో హైస్పీడ్ కారిడార్ నిర్మాణానికి రూ.13 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఇదే సమయంలో బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవే ఇప్పుడు తుది దశకు చేరుకుంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications