వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి పచ్చి బూటకం: సోమిరెడ్డి

|
Google Oneindia TeluguNews

Central should give special status to Seemandhra before elections: Somireddy
హైదరాబాద్/విజయవాడ: సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి హోదా కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పచ్చి బూటకమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్రకు ప్రత్యేక హోదా కల్పిస్తామంటే అది ఎన్నికల ముందే కల్పించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ప్రత్యేక ప్రతిపత్తిపై నాటకాలాడుతున్నాయని చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రణాళిక సంఘం రూపొందించే ప్రత్యేక ప్రతిపత్తి సిఫార్సులను జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో మెజార్టీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆమోదం తెలపాల్సి ఉంటుందని తెలిపారు. గతంలో రాజస్థాన్, ఒరిస్సాలకు ప్రత్యేక ప్రతిపత్తి సిఫార్సులను జాతీయ అభివృద్ధి మండలి తిరస్కరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఏపికి దళితుడినే సిఎం చేయాలి: పద్మారావు

విజయవాడ: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర) రాష్ట్రానికి దళితుడినే ముఖ్యమంత్రిని చేయాలని దళిత మహాసభ ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావు డిమాండ్ చేశారు. ఆయన సోమవారం మాట్లాడుతూ.. సీమాంధ్రకు బుద్ధప్రదేశ్‌గా నామకరణం చేయాలని అన్నారు. సీమాంధ్రలోని విశాఖపట్టణాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు.

అరకులోయలో గిరిజన విశ్వవిద్యాలయం, రాజమండ్రిలో దళిత విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని సూచించారు. విజయవాడ, గుంటూరు నగరాల మధ్యలో రాజధాని నగరాన్ని ఏర్పాటు చేయాలని, అనంతపురంలో విద్యుత్ కారిడార్ నిర్మించాలని కోరారు. విజయాడలో ఎన్ఐటి, రాజమండ్రిలో ఐఐటీలను ఏర్పాటు చేయాలని కత్తి పద్మారావు డిమాండ్ చేశారు.

English summary
Telugudesam Party senior leader Somireddy Chandramohan reddy on Monday said that Central Government should give special status to Seemandhra before elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X