విభజన షాకింగ్: 'బాబు-జైట్లీ భేటీ తర్వాతే సుప్రీంలో కేంద్రం అఫిడవిట్!'

అమరావతి: కేంద్ర ప్రభుత్వం వేసిన అఫిడవిట్ పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హడావుడి చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గురువారం ధ్వజమెత్తారు. అసలు చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి మంతనాల తర్వాతే కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిందని షాకింగ్ కామెంట్స్ చేశారు.

ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ బెట్టర్ అని రాష్ట్రంలోని ఊరువాడా తిరిగి చెప్పింది సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు కాదా అని ప్రశ్నించారు. అసలు విజయవాడలోని దుర్గగుడి ఫ్లై ఓవర్ కట్టలేని చంద్రబాబు ఇక ప్రపంచస్థాయి రాజధాని అమరావతిని ఏం కడతారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు అవినీతిపై కేంద్రం ఎందుకు మౌనంగా ఉంది?

చంద్రబాబు అవినీతిపై కేంద్రం ఎందుకు మౌనంగా ఉంది?

చంద్రబాబు నాయుడు ఈ నాలుగేళ్ల కాలంలో ఎంతో అవినీతికి పాల్పడ్డారని అంబటి ఆరోపించారు. ఈ అవినీతిపై కేంద్రం మౌనంగా ఎందుకు ఉందో చెప్పాలని నిలదీశారు. ఏపీకి బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కలిసి వెన్నుపోటు పొడిచాయని ఆరోపించారు. విభజన హామీలు నెరవేరకపోవడానికి ఆ రెండు పార్టీలో కారణం అన్నారు. విభజన హామీలపై కేంద్రం కొత్తగా చెప్పిందేమీ లేదని, 2016లో జైట్లీతో చంద్రబాబు మంతనాల తర్వాతే అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. ఇది కొత్తదేమీ కాదన్నారు. ప్యాకేజీ ఇస్తామంటే శాలువాలతో సన్మానం చేశారన్నారు. హోదా విషయంలో మోడీది ఎంత తప్పో, చంద్రబాబుదీ అంతే తప్పు అన్నారు.

 హోదా వద్దన్నది చంద్రబాబే

హోదా వద్దన్నది చంద్రబాబే

రాష్ట్రానికి అన్యాయం జరిగిందని నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు చంద్రబాబుకు తెలిసిందా అని అంబటి నిలదీశారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే జైల్లో పెడతానని చంద్రబాబు చెప్పారని, హోదా మా హక్కు అని వైసీపీ నేతలు అంటే అవహేళన చేశారని గుర్తు చేశారు. హోదాను పాతరేయడానికి ప్రయత్నించిన చంద్రబాబును ప్రజలు క్షమించరన్నారు. ఏపీ అధోగతికి ఇంటి దొంగ చంద్రబాబు కారణం అన్నారు. ఏపీలో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలన్నారు. వైసీపీపై అక్రమ కేసులు పెడితే భయపడేది లేదన్నారు.

 25 లక్షల ఇళ్లు ఎప్పుడు కడతారు?

25 లక్షల ఇళ్లు ఎప్పుడు కడతారు?

టీడీపీ సర్కారు 3 లక్షల ఇళ్లు కట్టి హడావుడి చేస్తోందని వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. చంద్రబాబు సర్వే ప్రకారం 25 లక్షల ఇళ్లను ఎప్పుడు కడతారని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లు కూడా టీడీపీ ఖాతాలో చూపించుకోవడం సిగ్గుచేటు అన్నారు. మంత్రి నారాయణ, చంద్రబాబులు ఇళ్ల పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకోవడానికి పథక రచన చేస్తున్నారన్నారు.

చంద్రబాబు మరోసారి డ్రామా

చంద్రబాబు మరోసారి డ్రామా

నాలుగేళ్లలో నాలుగు లక్షల ఇళ్లు కట్టించని చంద్రబాబు ఆరు నెలల్లో మిగతా ఇళ్లను ఎలా కట్టిస్తారని రోజా ప్రశ్నించారు. పేదలందరికీ నివాస గృహాలు కట్టిస్తానని చంద్రబాబు మరోసారి డ్రామాలు ఆడుతున్నారన్నారు. చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్దాలే అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి పేదలకు ఇళ్లు రికార్డు స్థాయిలో కట్టించారన్నారు. అలాంటిది ఇప్పుడు టీడీపీ నాయకులు, కార్యకర్తలకే ఇస్తున్నారన్నారు. కాగా, రోజా నిండ్ర మండల కేంద్రంలో రెండు బస్సు స్టాప్‌లు ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+