ఏపీ అస్సలు అప్పు ఇదే ! పార్లమెంటులోనే తేల్చేసిన కేంద్రం- వైసీపీ, టీడీపీ ఇద్దరికీ..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా అప్పు ఏటికేడాది పెరుగుతుందనే విమర్శల్ని ప్రతిపక్ష టీడీపీ ఎప్పుడూ చేస్తుంటుంది. దీనికి కౌంటర్ గా చంద్రబాబు హయాంలో అప్పులతో పోలిస్తే ఇదేమీ ఎక్కువ కాదని వైసీపీ కౌంటర్లు కూడా ఇస్తోంది. అలాగే చంద్రబాబు నుంచి వైఎస్ జగన్ కు అధికార మార్పిడి అయ్యే క్రమంలో అప్పులు భారీగా ఉన్నట్లు వైసీపీ గతంలో శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. కానీ ఇప్పటికీ వాస్తవంగా ప్రభుత్వం చేసిన అప్పెంత అనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పార్లమెంటులో ఇవాళ కేంద్రం దీనిపై స్పష్టత ఇచ్చింది.

ఏపీ అప్పులపై కేంద్రం క్లారిటీ
ఏపీలో అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో మీ హయాంలో అప్పులెక్కువ అంటే మీ హయాంలోనే అంటూ వైసీపీ, టీడీపీ ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో పార్లమెంటులో ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. బడ్జెట్ లో ఇచ్చిన వివరాల ప్రకారం చేసిన అప్పులను ఇవాళ వెల్లడించింది. దీంతో అసలు ఏ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏమేరకు అప్పులు చేశారన్న దానిపై కొంతమేర స్ఫష్టత వచ్చినట్లయింది. అలాగే రాష్ట్రంలో అప్పులపై అధికార, విపక్షాలు చేస్తున్న ఆరోపణలు, ప్రత్యారోపణలకు బ్రేక్ వేసినట్లయింది.

2018 నుంచి ఇప్పటివరకూ..
రాష్ట్రంలో 2018 నుంచి అంటే చంద్రబాబు ప్రభుత్వ హయాం నుంచి ఇప్పటివరకూ అంటే వైఎస్ జగన్ ప్రభుత్వ హయాం వరకూ అప్పుల వివరాలు పార్లమెంటులో ఆర్ధిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి ఇవాళ వెల్లడించారు. దీని ప్రకారం 2018 నుంచి ఇప్పటివరకూ అప్పులు ఎలా పెరుగుతూ పోయాయన్న దానిపై స్పష్టత లభించింది. ఈ లెక్కన చూస్తే 2018లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు రూ.2.29 లక్షల కోట్లుగా ఉండగా.. ఇప్పుడు ఆ అప్పు కాస్తా 3.6 లక్షల కోట్లకు పెరిగిందని కేంద్రం వెల్లడించింది.

అప్పుల శాతంలో పెరుగుదల ఇలా..
అలాగే అప్పుల శాతంలోనూ పెరుగుదల ఉందని కేంద్ర మంత్రి తన సమాధానంలో వెల్లడించారు. 2017-18 ఆర్ధిక సంవత్సరంలో 9.8 శాతం అప్పులు తగ్గితే 2020-21 నాటికి 17.1 శాతం పెరుగుదల ఉన్నట్లు కేంద్రం తేల్చింది. ఏపీ స్థూల జాతీయోత్పత్తిలోనూ మూడేళ్లుగా అప్పుల శాతం పెరుగుతూనే ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చే నాటికి 2014లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో అప్పుల శాతం 42.3 శాతం ఉండగా ఆ తరువాత భారీగా తగ్గింది. 2015లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో ఉన్న అప్పులు 23.3 శాతం ఉండగా.. 2021 నాటికి ఏపీ స్థూల జాతీయోత్పత్తిలో 36.5 శాతంగా అప్పులు ఉన్నాయి.

చివర్లో ఓ ట్విస్ట్ ఇలా..
అయితే ఇదంతా బడ్జెట్ ప్రకారం చూస్తే మాత్రమే నమోదైన వివరాలు. బడ్జెట్ తో సంబంధం లేకుండా చేసుకుంటూ పోతున్న అప్పుల వివరాలు ఇక్కడ లేవు. దీంతో ఏపీ ప్రభుత్వం బడ్జెటేతర అప్పులను భారీగా చేస్తోందని కేంద్రమంత్రి ఇవాళ వెల్లడించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో కేంద్రానికి పంపే అప్పుల వివరాలు బహిర్గతం అవుతాయి కాబట్టి బడ్డెట్ తో సంబంధం లేకుండా ఇతర మార్గాల్లో భారీగా అప్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మాత్రం వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నిత్యం విమర్శలు చేస్తూనే ఉంది. అయితే టీడీపీ హయాంలోనూ ఇదే తరహాలో అప్పులు చేశారని వైసీపీ కౌంటర్ ఇస్తోంది.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications