వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇష్యూ చేస్తారా,అంతా వాళ్లే, ఇప్పటికీ రాలేదు: ఏపీకి సాయంపై జైట్లీ బాంబు, బాబుకు షాక్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/అమరావతి: కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ, వైసీపీలు అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్‌కు సాయంపై మరోసారి స్పందించారు. ఏపీకి హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తున్నామన్నారు.

చదవండి: ఏపీకి నిధులుచ్చినా.. చంద్రబాబుకు పీయూష్ గోయెల్ ఝలక్

హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని చెబితే 2016లో అంగీకరించారని చెప్పారు. అయితే, మరో రకంగా ఏపీకి నిధులు ఇవ్వాలని ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని, దానికి అంగీకరించినట్లు చెప్పారు.

చదవండి: చాలామందిని సీనియర్లను కలిశా, అదీ మాట్లాడుతా: పీఆర్పీపై పవన్ కళ్యాణ్

వనరులు కావాలా, ఇష్యూ చేస్తారా

వనరులు కావాలా, ఇష్యూ చేస్తారా

విభజన హామీలను అంశాల వారీగా నెరవేర్చుతున్నామని జైట్లీ అభిప్రాయపడ్డారు. సమస్య పరిష్కారం ఏపీ ప్రభుత్వం చేతుల్లోనే ఉందని అభిప్రాయపడ్డారు. వారికి వనరులు కావాలా లేక సమస్య చేయదల్చుకున్నారా అన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. నిధుల విషయంలో ఎలాంటి జాప్యం ఉండదన్నారు.

మీతో కలిసి ఉండంలో అర్థంలేదు: అమిత్ షాకు బాబు లేఖ, కారణాలు చెప్పిన సీఎంమీతో కలిసి ఉండంలో అర్థంలేదు: అమిత్ షాకు బాబు లేఖ, కారణాలు చెప్పిన సీఎం

ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు

ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు

14వ ఆర్థిక సంఘం సూచన నేపథ్యంలో ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని జైట్లీ చెప్పారు. కానీ ప్యాకేజీ కింద నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. హోదా ఇవ్వాల్సిందేనని టీడీపీ పట్టుబడిన నేపథ్యంలో అది కుదరదని మరోసారి తేల్చి చెప్పారు.

ఏపీ ప్రభుత్వం ఆ వివరాలు ఇవ్వట్లేదు

ఏపీ ప్రభుత్వం ఆ వివరాలు ఇవ్వట్లేదు

విభజన హామీలు అమలు చేయడం లేదని, ఏపీకి హోదా ఇవ్వడం లేదని తెలుగుదేశం ఇటీవల కేంద్రమంత్రివర్గం నుంచి తప్పుకుంది. ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత టీడీపీ, వైసీపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఈ నేపథ్యంలో జైట్లీ స్పందించారు. ఏపీకి హోదాతో సమానమైన ప్యాకేజీ ఇచ్చేందుకు తాము ఎప్పుడు సిద్ధమేనని, కానీ అందుకు సంబంధించిన వివరాలు ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వడం లేదన్నారు.

2016లో ప్యాకేజీకి అంగీకారం

2016లో ప్యాకేజీకి అంగీకారం

ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే స్పందన కోసం తాము వేచి చూస్తున్నామని జైట్లీ చెప్పారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల ఫండ్‌ను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచామని చెప్పారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 90 శాతం కేంద్రం ఇస్తుందని చెప్పారు. జనరల్ కేటగిరీ రాష్ట్రాలకు 40 శాతంగా ఉంటుందన్నారు. ప్రత్యేక హోదాతో సమానమైన ప్యాకేజీని ఏపీకి అయిదేళ్ల పాటు ఇచ్చేందుకు 2016లో అంగీకరించామన్నారు. అలాగే ఎక్స్‌టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులకు కేంద్రం 90 శాతం ఇస్తుందన్నారు.

ఏపీ కూడా అంగీకరించింది

ఏపీ కూడా అంగీకరించింది

ఇందుకు ఏపీ ప్రభుత్వం కూడా అంగీకరించిందని జైట్లీ చెప్పారు. కానీ జనవరిలో ఏపీ తన రూటు మార్చుకుందన బాంబు పేల్చారు. నాబార్డ్ నుంచి నిధులు కావాలని అడుగుతోందని, అప్పుడు ఏపీకి రుణ సామర్థ్యం తగ్గుతుందని పునరుద్ఘాటించారు. ఇందుకోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఇచ్చేందుకు సూచన చేశామన్నారు. ఇందులో కేంద్రం 90 శాతం చెల్లిస్తుందన్నారు.

ఇప్పటి వరకు రాలేదు, వేచి చూస్తున్నాం

ఇప్పటి వరకు రాలేదు, వేచి చూస్తున్నాం

ఫిబ్రవరి 7న ఏపీ అధికారులతో సమావేశం జరిగితే ప్రభుత్వాన్ని అడిగి వస్తామని చెప్పారని, కానీ ఇప్పటి వరకు ఒక్కరు రాలేదని జైట్లీ అన్నారు. కేంద్రం నుంచి ఏపీ పట్ల చిత్తశుద్ధి ఉందని, ఎలాంటి జాప్యం లేదన్నారు. కానీ జనవరిలో నిధుల సేకరణ విషయమై ఏపీ ప్రభుత్వం తీరులోనే మార్పు వచ్చిందని, తాము ఇవ్వమని చెప్పలేదని అభిప్రాయపడ్డారు.

English summary
A day after TDP quit NDA over lack of financial support, Finance Minister Arun Jaitley on Friday said the Centre was committed to giving Andhra Pradesh a special package equivalent to a special category state and has been endlessly waiting for the state government to revert on mechanism of receiving it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X