జగన్ సర్కార్ సహకరించట్లేదు-రాజ్యసభలో కేంద్రం-పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి ఎలా ?
ఏపీలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి వ్యవహారం ఇవాళ రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. ఏపీకి చెందిన బీజేపీ, టీడీపీ ఎంపీలు ఈ వ్యవహారాన్ని ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తారు. దీనిపై స్పందించిన వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అసలు వాస్తవాన్ని బయటపెట్టారు.
ఏపీలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ముందుగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. ఏపీలో కేంద్ర ప్రభుత్వం 33 రైల్వే ప్రాజెక్టులు చేపడుతోందని, ఇందులో 21 ప్రాజెక్టులు కేంద్రమే సొంతంగా చేపడుతోందని తెలిపారు. మరో 6 ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేపడుతోందన్నారు. ఇందులో కీలకమైన నడికుడి-శ్రీకాళహస్తి కారిడార్, గుంటూరు-గుంతకల్ ప్రాజెక్టు, నరసరావుపేట-హైదరాబాద్-సికింద్రాబాద్ చెన్నై-చిలకలూరిపేట-హైదరాబాద్ లైన్లు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఈ ప్రాజెక్టుల్ని ముందుకు తీసుకెళ్లాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ కోరారు. ఈ ప్రాజెక్టుల్ని ఎప్పటికల్లా పూర్తవుతాయని ఆయన ప్రశ్నించారు. అనంతరం మరో ప్రశ్నలో ఏపీలో 5 పారిశ్రామిక నగరాలు- 3 ఆర్ధిక కారిడార్ల ద్వారా చేపట్టాలని గతంలో నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వీటిలో ఏయే ప్రాజెక్టులు ఏ స్ధాయిలో ఉన్నాయో చెప్పాలన్నారు.'

అనంతరం టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఇదే అంశంపై మాట్లాడుతూ... హైదరాబాద్-బెంగళూరు కారిడార్ లో ఓర్వకల్లు నోడ్ ను మాత్రమే గుర్తించారు. ఇది ఎప్పటికల్లా పూర్తవుతుంది. ఇందులో ఎలాంటి పురోగతి లేదని కేంద్రం దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్.. 9800 ఎకరాలకు దీన్ని ప్లాన్ చేశామని. 4500 ఎకరాల్లో తామే సొంతంగా వాణిజ్య పార్క్ ఏర్పాటు చేసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందా, లేక మమ్మల్ని చేపట్టమంటారా క్లారిటీ అనేది వారి నుంచే తీసుకోవాలని పీయూష్ గోయల్ కోరారు. అలాగే
ఏపీలో ఆర్ధిక వృద్ధి కోసం ఎన్నో ప్రాజెక్టులు చేపట్టామన్నారు. కానీ రాష్ట్రం కూడా భూమిచ్చి, మిగతా సహకారం ఇస్తేనే ముందుకెళ్లగలమన్నారు. కృష్ణపట్నం నోడ్ చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో భాగంగా చేపట్టామని, కాంట్రాక్టర్ ను నియమించాల్సిన బాధ్యత రాష్ట్రానిదేనన్నారు. ఓర్వకల్లు నోడ్ కూడా కావాలని ఏపీ కోరుతోందని గోయల్ తెలిపారు. రాష్ట్రం సహకరిస్తే ముందుకెళ్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉంది. అయితే అభివృద్ధి జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలి. యూనియన్ ప్రభుత్వం ఒక్కరే అన్నీ చేయలేరని, రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులు లేకపోవడంపై అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications