వెంటనే ఏపీకి వెళ్లిపోండి- 11 మంది తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ లకు కేంద్రం ఆదేశం..!

గతంలో ఏపీ విభజన సందర్బంగా అఖిల భారత సర్వీసు అధికారులను వారి స్ధానికత, ఇతర అంశాల ఆధారంగా ఇరు రాష్ట్రాలకూ కేంద్రం కేటాయించింది. అయితే దీనికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వాల కోరిక మేరకు ఓ 11 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మాత్రం తెలంగాణకు వెళ్లారు. అప్పట్లో కేంద్రం ఉత్తర్వులకు భిన్నంగా వీరు తెలంగాణకు వెళ్లడంతో క్యాట్ తో పాటు కోర్టుల్లోనూ కేసులు నడుస్తున్నాయి. అదే సమయంలో కేంద్రం తాజాగా వీరిని ఏపీకి వెళ్లిపోవాలని తాజాగా ఆదేశాలు ఇచ్చింది.

centre orders to report 11 AIS officers working in Telangana in ap immediately

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ క్యాడర్ కు కేటాయించినా తెలంగాణ క్యాడర్ ఎంచుకుని వెళ్లిపోయిన 11 మంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఆ తర్వాత తమ సొంత కారణాలతో క్యాట్, కోర్టుల్ని ఆశ్రయించారు. తాము కోరుకున్న క్యాడర్ మాత్రమే ఇవ్వాలని వాదిస్తున్నారు. ఇందులో సీనియర్ ఐఏఎస్ అధికారులు కాటా ఆమ్రపాలి, రోనాల్డ్ రాస్, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, ఐపీఎస్ లు అంజనీ కుమార్, అభిషేక్ మహంతి, అభిలాష్ ఉన్నారు. వీరందరినీ తక్షణం ఏపీలో జాయిన్ అయ్యేలా చూడాలని డీవోపీటీ రెండు రాష్ట్రాల సీఎస్ లకు ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యూష్ సిన్హా కమిటీ వీరందరినీ ఏపీ క్యాడర్ కు కేటాయించగా.. వీరంతా తెలంగాణ క్యాడర్ కు వెళ్లేందుకు ఆసక్తి చూపారు. కానీ కేంద్రం వారికి నో చెప్పింది. దీంతో వీరంతా క్యాట్, కోర్టుల్ని ఆశ్రయించారు. ఆ కేసులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కానీ మరోసారి ఏపీలో ఏఐఎస్ అధికారుల కొరత కారణంగా వీరిని ఏపీకి కేటాయిస్తూ తాజా ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయినా కోర్టుల్లో కేసులు పెండింగ్ లో ఉండటంతో వీరి జాయినింగ్ పై ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+