వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ ఎంపీలకు షాక్: నేనెవర్ని చెప్పడానికి.. జైట్లీతో మాట్లాడి చేతులెత్తేసిన అద్వానీ

|
Google Oneindia TeluguNews

అమరావతి/న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత ఎల్‌కె అద్వాని వద్దకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ ఎంపీలకు చుక్కెదురయింది. వారి ఆశలు నీరుగారిపోయాయి. ఓ విధంగా తాను ఏం చేయగలనని అద్వానీ టీడీపీ ఎంపీల ముందు చేతులెత్తేసినట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది.

ఏపీకి బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని బీజేపీపై మండిపడుతున్న ఎంపీలు అందరి మద్దతు కూడగడుతున్నారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు వారు ముందుకు సాగుతున్నారు. బడ్జెట్‌లో అన్యాయం, ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చకలేదని, ఈ నేపథ్యంలో పార్టీలను ఏకం చేయాలని, ముఖ్య నేతలకు విజ్ఞప్తులు చేయాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు.

అద్వానీని కలిసిన టీడీపీ ఎంపీలు: 'బీజేపీని నమ్మట్లేదు, అంత ఖర్మ పట్టలేదు, కవితకు థ్యాంక్స్'అద్వానీని కలిసిన టీడీపీ ఎంపీలు: 'బీజేపీని నమ్మట్లేదు, అంత ఖర్మ పట్టలేదు, కవితకు థ్యాంక్స్'

అద్వానీని కలిసిన టీడీపీ ఎంపీలు

అద్వానీని కలిసిన టీడీపీ ఎంపీలు

ఇందులో భాగంగా వారు శుక్రవారం అద్వానీని కలిశారు. తమ గోడును ఆయనకు వెళ్లబోసుకున్నారు. ఏపీకి న్యాయం జరిగేలా, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేసేలా ప్రయత్నాలు చేయాలని కోరారు. తాను జైట్లీతో మాట్లాడుతానని ఆయన వారికి అభయం ఇచ్చారు.

మళ్లీ సాయంత్రం కలిశారు

మళ్లీ సాయంత్రం కలిశారు

టీడీపీ ఎంపీలు ఆ తర్వాత తిరిగి సాయంత్రం అద్వానీని కలుసుకున్నారు. హామీల అమలుపై ఏం మాట్లాడారని ఆయనను అడిగారు. తాను జైట్లీతో మాట్లాడానని చెప్పిన అద్వానీ, ఆ తర్వాత నిర్వేదం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

నేను ఎవరిని చెప్పడానికి

నేను ఎవరిని చెప్పడానికి

అసలు నేను ఎవరిని చెప్పడానికి అని ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీల వద్ద నిట్టూర్చారని సమాచారం. బీజేపీ ఈ స్థాయికి రావడానికి అద్వానీ కారణం. కానీ ఇప్పుడు బీజేపీలో అద్వానీ చక్రం తిప్పలేకపోతున్నారన్నది వాస్తవం.

ఫలించని అద్వానీ దౌత్యం

ఫలించని అద్వానీ దౌత్యం


కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పరిపాలన ఉంటుంది. బీజేపీలో మాత్రం అలా ఉండదు. ఇందులో ఎవరైనా అధ్యక్షులు కావొచ్చు. కాబట్టి ఇప్పుడు ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షులు అమిత్ షా చక్రం తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన జైట్లీతో మాట్లాడినప్పటికీ.. టీడీపీ ఎంపీల ప్రయత్నం, అద్వానీ దౌత్యం ఫలించలేదని తెలుస్తోంది.

అద్వానీ నిర్వేదం

అద్వానీ నిర్వేదం

అద్వానీని కలిసిన టీడీపీ ఎంపీలు విభజన అంశాలు, బడ్జెట్ విషయంలో కేంద్రంపై ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. హామీల అమలుకు మీరు సాయం చేయాలని కోరారు. కానీ మొదటిసారి అభయమిచ్చిన ఆయన రెండోసారు ఎంపీలు కలిసినప్పుడు నిర్వేదం వ్యక్తం చేశారని వార్తలు రావడం గమనార్హం. వాజపేయి హయాంలో చంద్రబాబు ఎన్డీయేలో ఉన్నారు. ఆ సమయంలో బీజేపీ అగ్రనేతలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి.

English summary
It is said that Telugudesam Party MPs did not get any assurance from Bharatiya Janata Party senior leader and MP LK Advani over NDA poll promises.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X