కేంద్రం స్మార్ట్ సిటీ మొత్తం లిస్ట్, తెలుసుకోండి: తొలి ఏడాది 20నగరాలు

న్యూఢిల్లీ: అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖ గురువారం నాడు స్మార్ట్ సిటీ నగరాలను ప్రకటించింది. ఏపీలో మూడు, తెలంగాణలో రెండు నగరాలను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చారు. ఏపీలో కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం, తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ నగరాలకు స్మార్ట్ జాబితాలో చోటు దక్కింది.

ముంబై, కోల్‌కతా, జైపూర్, లక్నో, రాంచీ, భువనేశ్వర్ తదితర నగరాలు చోటు దక్కించుకున్నాయి. అత్యధికంగా ఉత్తర ప్రదేశ్‌లో 13 నగరాలను స్మార్ట్ సిటీలకు ఎంపిక చేశారు.

 Centre unveils list of 98 Smart Cities: All you need to know

100 స్మార్ట్ సిటీల కోసం కేంద్రం రూ.48,000 కోట్లు ఖర్చు చేయనుంది. ఢిల్లీతో సహా అన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు స్మార్ట్ జాబితాలో చోటు దక్కింది.

ఉత్తర ప్రదేశ్ 13, తమిళనాడు 12, మహారాష్ట్ర 10, మధ్యప్రదేశ్ 7, బీహార్, ఏపీల నుంచి 3 నగరాలకు చోటు దక్కింది. రాజధాని నగరాలైన ఈటానగర్, పాట్నా, సిమ్లా, బెంగళూరులకు స్మార్ట్ సిటీలో చోటు దక్కలేదు.

స్మార్ట్ సిటీలను ఫేజుల వారీగా అభివృద్ధి చేస్తారు. కేంద్ర ప్రభుత్వం తొలి ఫేజ్‌లో 20 స్మార్ట్ సిటీలను తీసుకుంటుంది. ఆ తర్వాత రెండేళ్లలో.. ఏడాదికి నలభై చొప్పున మిగతా 80 నగరాలను తీసుకుంటారు.

స్మార్ట్ సిటీల కోసం కేంద్రం రూ.500 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రతి స్మార్ట్ సిటీకి కేంద్రం నుంచి ఏడాదికి రూ.100 కోట్ల చొప్పున వస్తుంది. ఒక్కో స్మార్ట్ సిటీకి ఐదేళ్లలో రూ.500 కోట్లు వస్తాయి.

 Centre unveils list of 98 Smart Cities: All you need to know

స్మార్ట్ సిటీలకు తగినంత నీటి సరఫరా ఉంటుంది. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తారు. పారిశుధ్ద్యానికి ప్రాధాన్యత ఇస్తారు. ప్రజా రవాణా వ్యవస్థకు పెద్దపీట వేస్తారు. పేదలకు గృహ వసతి అందుబాటులోకి తీసుకు వస్తారు. ఐటి కనెక్టివిటీ ఉంటుంది. ఈ గవర్నెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తారు. అన్ని రంగాల్లో పౌరుల భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇస్తారు.

ఆంధ్రప్రదేశ్- విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ
అరుణాచల్ ప్రదేశ్- పాసీఘాట్
అసోం- గౌహతి
బీహార్- ముజఫర్‌నగర్, భగల్‌పూర్, బీహార్ షరీఫ్
గోవా- పనాజీ
గుజరాత్- గాంధీనగర్, అహ్మదాబాద్, సూరత్, వదోదర, రాజ్ కోట్, దహూద్
హర్యానా- కర్నాల్, ఫరీదాబాద్
హిమాచల్ ప్రదేశ్- ధర్మశాల
జార్ఖండ్- రాంచీ
కర్ణాటక- మంగళూరు, బెళగావి, శివమొగ్గ, హుబ్లీ-ధార్వాడ్, తుముకూరు, దావణగెరె
మధ్యప్రదేశ్- భోపాల్, ఇండోర్, జబల్ పూర్, గ్వాలియర్, సాగర్, సాత్నా, ఉజ్జయిని
మహారాష్ట్ర- నవీ ముంబై, నాసిక్, థానే, గ్రేటర్ ముంబై, అమరావతి, సోలాపూర్, నాగపూర్, కల్యాణ్, ఔరంగాబాద్, పుణె
మణిపూర్- ఇంపాల్
మేఘాలయా- షిల్లాంగ్
మిజోరాం- ఐజ్వాల్
నాగాలాండ్- కోహిమా
ఒడిశా- భువనేశ్వర్, రూర్కేలా
పంజాబ్- లూథియానా, జలంధర్, అమృతసర్
రాజస్థాన్- జైపూర్, ఉదయ్ పూర్, కోటా, ఆజ్మీర్
సిక్కిం- నామ్చీ
తమిళనాడు- తిరుచ్చిరాపల్లి, తిరునల్వేలి, దుండిగల్, తంజావూరు, తిరుపూరు, సేలం, వేలూరు, కోయంబత్తూరు, మధురై, ఈరోడ్, తూత్తుక్కుడి, చెన్నై
తెలంగాణ- గ్రేటర్ హైదరాబాద్, వరంగల్
త్రిపుర- అగర్తాల
ఉత్తరప్రదేశ్- మొరాదాబాద్, అలీగఢ్, షహరాన్ పూర్, బరేలీ, ఝాన్సీ, కాన్పూర్, అలహాబాద్, లక్నో, వారణాసి, ఘజియాబాద్, ఆగ్రా, రాంపూర్ (యూపీలో 13 నగరాలకు గాను 12 మాత్రమే ప్రకటించారు)
ఉత్తరాఖండ్- డెహ్రాడూన్
పశ్చిమ బెంగాల్- న్యూటౌన్ కోల్‌కతా, విధాన్ నగర్, దుర్గాపూర్, హల్దియా
జమ్మూ కాశ్మీర్‌కు ఒక నగరాన్ని కేటాయించారు. ఇంకా దానిపై తేలాల్సి ఉంది. జమ్ము, శ్రీనగర్‌ల మధ్య పోటీ నెలకొంది.
అండమాన్ అండ్ నికోబార్: పోర్ట్ బ్లెయిర్
చండీగఢ్
డామన్ అండ్ డయ్యూ: డయ్యూ
దాద్రా అండ్ నగర్ హవేలి: శివశాల
లక్షద్వీప్: కవరత్తి
పుదుచ్చేరి: ఔల్గారెట్
ఢిల్లీ: న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+