కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌ సినిమానా .. మజాకా ...! బొమ్మ పడింది.. కడప జేసీపై వేటు పడింది..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌ ఎఫెక్ట్... ఎన్నిక‌ల సంఘం సీరియ‌స్‌!! || Oneindia Telugu

ఏకంగా ఒక జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ పైనే ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ఎఫెక్ట్ పడింది. తొలుత ఆర్జీవి వ‌ర్సెస్ టీడీపీగా ఉన్న ఈ సినిమా వ్య‌వ‌హారం ఆ త‌రువాత టీడీపీ..వైసీపీ మ‌ధ్య పొలిటిక‌ల్ వార్‌గా మారింది. ఎన్నిక‌ల సంఘం ఏపీలో సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌క స‌సేమిరా అంది. అయినా..ఏపీలోని ఒక జిల్లాలో సినిమాను ప్ర‌ద‌ర్శించారు. దీని పైన ఎన్నిక‌ల సంఘం సీరియ‌స్ అవ్వ‌టంతో ఏకంగా ఆ జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ పైనే చ‌ర్య‌లకు రంగం సిద్ద‌మైంది.

ఈపీ ఆదేశాలు ఉల్లంఘించార‌ని..
ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పైన తొలి నుండి వివాదం న‌డుస్తూనే ఉంది. ఈ సినిమాకు సంబంధించిన తొలి ట్ర‌యిల‌ర్ విడుద‌ల సంద‌ర్భంలోనే చంద్ర‌బాబును కించ‌ప‌రిచేలా పాట చిత్రీక‌రించారంటూ టీడీపీ నేత‌లు కోర్టును ఆశ్ర‌యించారు. ఆ త‌రువాత కూడా సినిమా కాంట్ర‌వ‌ర్సీగా మారింది. సినిమాను ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏపీలో విడుద‌ల చేయ‌వద్దంటూ కోర్టు కోక్కారు. ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోర్టు సూచించింది. దీంతో, కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎవ‌రి బ‌యోపిక్‌లు కోడ్ ముగిసే వ‌రకూ ప్ర‌ద‌ర్శించ‌వ‌ద్ద‌ని ఆదేశించింది. దీంతో..సినిమా తెలంగాణ వ‌ర‌కు విడుద‌ల అయింది. ఈ నెల 1న ఏపీలోనూ సినిమా ప్ర‌ద‌ర్శ‌ను ఆర్జీవీ అనుమ‌తి కోరినా..ఎన్నిక‌ల సంఘం స‌సేమిరా అంది. దీంతో.. సినిమా విడుద‌ల వాయిదా ప‌డింది. ఏపీలోని క‌డ‌ప జిల్లాలో సినిమా రెండు ఆట‌లను ప్ర‌ద‌ర్శించిన‌ట్లు ఫిర్యాదు రావ‌టంతో ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి చ‌ర్య‌ల దిశ‌గా నిర్ణ‌యం తీసుకున్నారు.

CEO recommended CEC to take action against Kadapa Joint collector..

జాయింట్ క‌లెక్ట‌ర్ పైన చర్య‌లు..
ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు ఏపీలో ఎక్క‌డా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌కు అనుమ‌తి లేదు. అయితే, క‌డ‌ప జిల్లాలో మాత్రం ఆ సినిమాను ప్ర‌ద‌ర్శించారు. దీని పైన రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారికి ఫిర్యాదులు వ‌చ్చాయి. దీని గురించి విచార‌ణ చేసిన సీఈవో సినిమా ప్ర‌ద‌ర్శ‌న నిజ‌మేన‌ని తేల‌టంతో చ‌ర్య‌ల‌కు నిర్ణయించారు. ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు సినిమా ప్ర‌ద‌ర్శ‌న నియంత్ర‌ణ‌లో క‌డ‌ప జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ విఫ‌ల‌మ‌య్యార‌ని..ఆయ‌న పైన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఏపీ సీఈఓ ద్వివేదీ సిఫార్సు చేసారు. ఇప్ప‌టికే రాజ‌కీయంగా వేడి పుట్టించిన ఈ సినిమా వ్య‌వ‌హారంలో ఇప్పుడు ఎన్నిక‌ల సంఘం సైతం సీరియ‌స్‌గా స్పందించింది. ఫ‌లితంగా జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ పైన చ‌ర్య‌ల‌కు రంగం సిద్ద‌మైంది. నేడో రేపో క‌డ‌ప జాయింట్ క‌లెక్ట‌ర్ పైన ఎన్నిక‌ల సంఘం క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు తీసుకొనే అవ‌కాశం ఉంది.

English summary
CEO Dwivedi serious of Kadap dist Joint collector. CEC order to not show Lakshmi's NTR movie in AP. But, in Kadapa cinema played. With this reason CEO asked CEC to take action against Kadapa Joint Collector.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X