వ్యసనాలకు బానిసై గొలుసు చోరీలు, వెంబడించి పట్టుకున్నారు (ఫొటోలు)
విశాఖపట్నం: వరుస గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని విశాఖపట్నంలోని ఎంవిపి, సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు పంపించారు. అతని వద్ద నుంచి 20.14 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

నగర క్రైమ్ డిసిపి టి. రవికుమార్ మూర్తి అందుకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. కైలాసపురం కస్తూరినగర్‌కు చెందిన మూగి మహేశ్వర రావు ఐటిఐ వరకు చదువుకున్నాడు. ప్రస్తుతం ఓ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. వ్యసనాలకు మరిగి అక్రమంగా డబ్బు సంపాదించడం కోసం దొంగతనాలు చేయడం ప్రారంభించాడు.

విశాఖపట్నంలోని నిర్మానుష్యమైన ప్రాంతాల్లో సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఒంటరిగా వెళ్లే మహిళల వెనక బైక్‌పై వెళ్లి బంగారు గొలుసులు, ఆభరణాలు తెంపుకుని వెళ్తుండేవాడు. దీంతో ఆయా పోలీసు స్టేషన్లకు అందిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సిసిఎస్ పోలీసులకు అప్పగించారు.

వరుస చోరీలపై దర్యాప్తు చేపట్టిన సిసిఎస్ సిఐ రఘుశ్రీనివాస రావు సిబ్బందితో కలిసి కృష్ణా కాలేజీ దరి జివిఎంసి టాక్స్ కలెక్టర్ కార్యాలయం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మహేశ్వర రావు పరారయ్యేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు వెంబడించి పట్టుకోవడంతో అసలు విషయం












Click it and Unblock the Notifications