చంద్రబాబు - పవన్ కల్యాణ్ భేటీ :ఫైనల్ డెసిషన్..!?

ఏపీలో పొత్తుల రాజకీయం ఆసక్తి కర మలుపులు తిరుగుతోంది. ఎన్డీఏ సమావేశానికి హజరైన పవన్ ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం కానున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ,జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలనేది పవన్ ఆలోచన. టీడీపీని ఆహ్వానించకుండా పవన్ ను మాత్రమే ఎన్డీఏ సమావేశానికి పిలవటంతో కొత్త లెక్కలు తెర మీదకు వచ్చాయి. ఈ సమయంలో చంద్రబాబు - పవన్ భేటీ కాబోతున్నారనే సమాచారం ఆసక్తి కరంగా మారుతోంది.

ఎన్డీఏ భాగస్వామిగా : బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్న పవన్..ఎన్డీఏ భాగస్వామిగా ఢిల్లీ సమావేశానికి హాజరయ్యారు. టీడీపీని తమతో కలుపుకొని వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు టీడీపీ - బీజేపీ మధ్య సంధి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలే చెబుున్నారు. తాజాగా ఎన్డీఏ సమావేశం ముందు టీడీపీతో పొత్తు పైన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

chandrababunaidupawankalyan1

ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర ఇంఛార్జ్ మురళధరన్ తో సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటన తరువాత పార్టీ కార్యాలయంలో మాట్లాడిన పవన్ నిర్ణయం జరిగిపోయిందని..ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కానుందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు చంద్రబాబుతో సమావేశం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.

టీడీపీతో బీజేపీ కలుస్తుందా : బీజేపీ నేతలు జనసేనతోనే తమ పొత్తు అని పదే పదే చెబుతున్నారు. పవన్ మాత్రం టీడీపీని కలుపుకొని వెళ్లాలని భావిస్తున్నారు. మూడు పార్టీలు కలవటం ద్వారా 2014 తరహాలో ఫలితం సాధిస్తామనే ధీమాతో ఉన్నారు. అటు బీజేపీ నుంచి ఇప్పటి వరకు టీడీపీతో కలిసే అంశం పైన స్పష్టత రాలేదు.

ఈ సమయంలో పవన్...చంద్రబాబు భేటీ ఆసక్తి కరంగా మారుతోంది. ఢిల్లీ పరిణామాలతో పాటుగా తాజాగా వాలంటీర్ల వ్యవస్థ పైన వ్యాఖ్యలు..ప్రభుత్వ స్పందన గురించి ఈ ఇద్దరి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వాలంటీర్ల పైన పవన్ చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం న్యాయ పరంగా ముందుకు వెళ్తోంది. పవన్ పైన కేసు విషయాన్ని చంద్రబాబు ఖండించారు.

chandrababunaidupawankalyan

పవన్ సక్సెస్ అవుతారా : పూర్తిగా వైసీపీ ప్రభుత్వాన్ని..సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకొని పవన్ రాజకీయం చేస్తున్నారు. సీఎం జగన్ సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా పొత్తుల అంశం లో బీజేపీ మూడ్ గమనించిన పవన్ కల్యాణ్..నేరుగా చంద్రబాబుతో చర్చిస్తారని తెలుస్తోంది. గతంలో ఢిల్లీలో అమిత్ షా, నడ్డాతో చంద్రబాబు సమావేశం అయ్యారు.

ఆ తరువాత ఎన్డీఏ పాత, కొత్త మిత్రుల సమావేశం జరిగింది. గతంలో చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్ గా పని చేసారు. ఈ సమావేశానికి మాత్రం ఆహ్వానం రాలేదు. ఇప్పుడు పవన్ ఎన్డీఏ భాగస్వామిగా ఉండటంతో ఎటువంటి పాత్ర పోషిస్తారనేది చూడాలి. అదే సమయంలో టీడీపీకి ఎన్డీఏ స్థానం అంశం కీలకంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+