మీరే ఫైనల్ కాదు, జగన్ బలం ఇదే - అభ్యర్దులకు చంద్రబాబు హెచ్చరిక..!!

టీడీపీ అభ్యర్దులకు పార్టీ అధినేత చంద్రబాబు అప్రమత్తం చేసారు. జగన్ బలం ఏంటో వివరించారు. జనసేనతో సమన్వయం గురించి సూచించారు. చివరి వరకు సర్వేలు సాగుతాయని..గెలుస్తారని భావిస్తేనే సీట్లు ఉంటాయని హెచ్చరించారు. సీనియర్లు అయినా గెలుస్తారని నమ్మకం ఉంటేనే పోటీలో ఉంటారని స్పష్టం చేసారు. మరో వైపు సీట్లు దక్కని పార్టీ ముఖ్య నేతలను చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. ప్రచారం కార్యాచరణనను నిర్దేశించారు.

అభ్యర్దులకు దిశా నిర్దేశం: ఎన్నికల్లో పోటీ చేసే 94 మంది అభ్యర్దులను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. వారితో టెలి కాన్ఫిరెన్స్ నిర్వహించిన ఆయన పలు కీలక సూచనలు చేసారు. వచ్చే 40 రోజులు అత్యంత కీలమని అప్రమత్తం చేసారు. నిత్యం ప్రజల్లోనే ఉండాలని స్పష్టం చేసారు. అభ్యర్థుల పనీతీరుపై ప్రతి వారం సమీక్ష జరుపుతామన్నారు.

Chandra Babu alerts party contesting Candidates over co ordination with Janasena

అభ్యర్దుల ఎవరి పనితీరు బాగా లేకుంటే టికెట్‌ నిరాకరించేందుకు వెనుకాడేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. జగన్‌పై అసంతృప్తిగా ఉన్న వైకాపా నేతలు వస్తే ఆహ్వానించాలని సూచించారు. జనసేన కేడర్ ను కలుపుకొని ఎన్నికల ప్రచారం కొనసాగించాలని నిర్దేశించారు. టికెట్ వచ్చింది కదా అని ధీమాగా ఉంటే నష్టపోతారని చంద్రబాబు హెచ్చరించారు.

జగన్ దేనికైనా సిద్దం: ఎన్నికల్లో గెలిచేందుకు జగన్ దేని కైనా సిద్దపడతారని అభ్యర్దులను చంద్రబాబు అలర్ట్ చేసారు. పార్టీలో సీటు రాని అసంతృప్తుల వద్దకు వెళ్లి వారిని కలుపుకొని వెళ్లాలని సూచించారు. సీటు వచ్చినట్లేనని ఎవరూ ధీమాగా ఉండవద్దని పేర్కొన్నారు. ప్రతీ అభ్యర్ది ఒక న్యాయవాదిని పెట్టకోవాలని చంద్రబాబు స్పష్టం చేసారు.

స్థానిక అంశాలతో పాటుగా ప్రత్యర్ధి పార్టీ అభ్యర్ది తో జరిగిన నష్టం గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. స్థానిక అంశాలను ప్రభావితం చేసే విధంగా ప్రచారం ఉండాలన్నారు. సీనియర్లు అయినా చివరి వరకు ప్రజల్లో ఉంటేనే సీటు ఉంటుందని తేల్చి చెప్పారు. ప్రచార నిర్వహన.. కార్యాచరణ పైన అభ్యర్దులకు దిశా నిర్దేశం చేసారు.

అసంతృప్తులకు బుజ్జగింపులు: ఇటు సీటు దక్కని ముఖ్య నేతలను చంద్రబాబు స్వయంగా బుజ్జగిస్తున్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజాకు సీటు ఇవ్వకపోవటానికి కారణాలను వివరించారు. పొత్తులు, సర్దుబాట్లకు సహకరించాలని సూచించారు. భవిష్యత్.. తగిన ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా అనకాపల్లి సీటు ఆశించిన పీలా గోవిందరావును అయ్యన్నపాత్రుడు చంద్రబాబు వద్దకు తీసుకొచ్చారు.

పెనుకొండ సీటు రాక ఆగ్రహంతో ఉన్న పార్ధసారధితో పరిటాల సునీత మాట్లాడారు. ఆయన చంద్రబాబు ను కలవనున్నారు. బీజేపీతో పొత్తు విషయం పైన స్పష్టత వచ్చిన తరువాత చివరి విడత అభ్యర్దుల జాబితా విడుదల చేస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రతీ అభ్యర్ది ప్రజల్లోనే ఉండాలని ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+