వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పుడే ప్రమాణ స్వీకారానికి డేట్లు ఫిక్స్ చేసుకున్న నేతలు ! చంద్ర‌బాబు 25న‌.. జ‌గ‌న్ 26న !

|
Google Oneindia TeluguNews

ఏపి రాజ‌కీయాల్లో వింత ప‌రిస్థితి. పోలింగ్ ముగిసింది. ఫ‌లితాలు రాలేదు. గెలుపు పైన ధీమా సంగ‌తి స‌రే. ఇప్పుడు ఏకంగా ప్ర‌మాణ స్వీకారానికి ముహూర్తాలు..విజ‌యోత్స‌వ స‌భ‌ల‌కు ఏర్పాట్లు చేసేస్తున్నారు. ఎవ‌రు గెలుస్తారో తెలియ‌దు. కానీ, ప్ర‌మాణ స్వీకార ముహూర్తాల్లోనూ పోటీ ప‌డుతున్నారు. చంద్ర‌బాబు ఈనెల 25న ప్ర‌మాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జ‌గ‌న్ త‌న జ‌న్మ న‌క్ష‌త్రం ప్ర‌కారం 26న ప్ర‌మాణ స్వీకారానికి సిద్దం అవుతున్నారు. ఇంత‌కీ ఏపిలో సీయం అయ్యే అవ‌కాశం ఎవ‌రికి ఉంది..ఎవ‌రు నిజంగా ప్ర‌మాణ స్వీకారం చేస్తారు..

 25న అక్క‌డే బాబు ప్ర‌మాణ స్వీకారం..

25న అక్క‌డే బాబు ప్ర‌మాణ స్వీకారం..

తిరిగి ఏపిలో అధికారం ద‌క్కించుకోవ‌టం ఖాయ‌మ‌నే న‌మ్మ‌కంలో టీడీపీ నేత‌లు ఉన్నారు. 23న ఫ‌లితాలు త‌మ‌కే అనుకూల‌గా వ‌స్తాయ‌ని..ఇక‌, చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం కేవ‌లం సాంప్ర‌దాయం కోస‌మే అంటూ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఇందు కోసం టిడిపి ఈ నెల 25న ముహూర్తం సైతం ఫిక్స్ చేసింది. 2014లో ప్ర‌మాణ స్వీకారం చేసిన ప్రాంతంలోనే నాగార్జున యూనివ‌ర్సిటీ ఎదురుగా ఖాళీ స్థ‌లంలో ప్ర‌మాణ స్వీకార ఏర్పాట్లు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇక, టిడిపి ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హించే మ‌హానాడు పైనా త‌ర్జ‌న‌ భ‌ర్జ‌న ప‌డుతున్నారు. 23న ఫ‌లితాలు, 25 న ప్ర‌మాణ స్వీకారం కార‌ణంగా మ‌హానాడుకు ఒక్క రోజుకే ప‌రిమితం చేయాల‌ని భావిస్తున్నారు. ప్ర‌తీ ఏటా మూడు రోజుల పాటు జ‌రిగే మ‌హానాడు ఈసారి కేవ‌లం ఎన్టీఆర్ జ‌న్మ‌దినం అయిన మే28న మాత్ర‌మే నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.

జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం 26న‌..

జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం 26న‌..

ఇక‌, ఈసారి అధికారంలోకి రావ‌టం ఖాయ‌మ‌ని భావిస్తున్న వైసిపి నేత‌లు సైతం జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికి ముహూర్తం ఖ‌రారు చేసేసారు. గ‌తంలో పార్టీ ప్లీన‌రీ నిర్వ‌హించిన ప్ర‌దేశంలోనే మంగ‌ళ‌గిరి హైవే స‌మీపంలో ప్ర‌మాణ స్వీకారం నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే పార్టీ నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సైతం జ‌గ‌న్ ఈనెల 26న ప్ర‌మాణ స్వీకారం చేస్తార‌ని చెప్పుకొచ్చారు. ఇక‌, జ్యోతిష్యం ప్ర‌కారం జ‌గ‌న్ జ‌న్మ న‌క్ష‌త్రం ఆరుద్ర‌. 26వ తేదీన ధ‌నిష్ట న‌క్ష‌త్రం ఉంది. ఆరుద్ర న‌క్ష‌త్రానికి ఇది మిత్ర తార‌. ఆదివారం పైగా స‌ప్త‌మి. తిధి..వారం..న‌క్ష‌త్రం అన్ని క‌లిసి రావ‌టంతో ప్ర‌మాణ స్వీకారానికి..ప‌ట్టాభిషేకానికి అది అరుదైన ముహూర్తంగా పండితులు ఇప్ప‌టికే నిర్ణ‌యం చేసారు. దీంతో..తాము గెల‌వ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్న వైసిపి నేత‌లు అదే రోజు ఉద‌యం ప్ర‌మాణ స్వీకారానికి చేయాల్సిన ఏర్పాట్ల గురించి ఇప్ప‌టికే ప్రాధ‌మికంగా ఓ అంచ‌నాకు వ‌చ్చారు.

ఇద్ద‌రూ సిద్ద‌మే..ఎవ‌రికి ద‌క్కేను..

ఇద్ద‌రూ సిద్ద‌మే..ఎవ‌రికి ద‌క్కేను..

పోలింగ్ జ‌రిగిన నాటి రాత్రి ఎన్నిక‌ల త‌ర‌హాలో గెలుపు పైనా చంద్ర‌బాబు..జ‌గ‌న్ ఇద్ద‌రూ పోటీ ప‌డి త‌మ గెలుపు గురించి మాట్లాడుతున్నారు. త‌మ‌కు లాండ్ స్లైడ్ విక్ట‌రీ ల‌భిస్తుంద‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. త‌మ‌కు 130 ప్ల‌స్ సీట్లు వ‌స్తాయ‌ని చంద్ర‌బాబు చెప్పుకొస్తున్నారు. ఇక‌, వీరిద్ద‌రూ మ‌రో అడుగు ముందుకేసి మ‌రీ ప్ర‌మాణ స్వీకార ముహూర్తాల‌ను సైతం ఖ‌రారు చేసుకున్నారు. జాతీయ స‌ర్వేలు..సోష‌ల్ మీడియాలో వైసిపికే అధికారం అంటూ అనేక స‌ర్వేలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే, ఆంధ్ర ఆక్టోప‌స్ ల‌గ‌డ‌పాటి మాత్రం త‌న అంత‌రంగికుల వ‌ద్ద మాత్రం టిడిపికే ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టార‌ని చెబుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల పైన ల‌గ‌డ‌పాటి జోస్యం ఫెయిల్ అవ్వ‌టంతో ఇప్పుడు ఆయ‌న చెబుతున్న‌దానికి విశ్వ‌స‌నీయ‌త శాతం త‌గ్గింది. దీంతో..ఇప్పుడు ఈ ప్ర‌మాణ స్వీకారాలకు నేత‌లు సద్దం అవుతున్న తీరు చూస్తున్న సామాన్యులు మాత్రం విస్తుపోతున్నారు. ఇటువంటి విచిత్ర రాజ‌కీయ ప‌రిస్థితి మాత్రం గ‌తంలో ఎప్పుడూ లేద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

English summary
Different political situation in AP. TDP And YCP preparing for sworn in ceremony program. Both parties decided dates also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X