వరద బాధితులకు పరిహారం జమ ఇలా - ఎవరికెంత..!!
వరద బాధితులకు ప్రభుత్వం ఆర్దిక ప్యాకేజీ ప్రకటించింది. భారీగా నష్టపోయిన ప్రతీ ఒక్కరికీ ఆర్దిక సాయం ఇవ్వాలని నిర్ణయించింది. వరదల్లో మునిగిన ప్రతీ ఇంటికి రూ 25 వేలు అందనుంది. అదే విధంగా ప్రతీ వాహనదారుడితో పాటుగా వ్యాపారులకు ఆర్దికంగా ప్రభుత్వం సాయం ఖరారు చేసింది. ప్యాకేజీలో భాగంగా బాధితులకు అందే పరిహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
బాధితులకు అండగా
విజయవాడ వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం ఆర్దికంగా ప్యాకేజీ ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్యాకేజీ వివరాలను వెల్లడించారు. బుధవారం నుంచే నష్ట పరిహారం పంపిణీ ప్రారంభమవుతుందని, వీలైనంతవరకూ రెండు మూడు రోజుల్లోనే బాధితుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని తెలిపారు. దీని ప్రకారం...వరదల్లో మునిగిన ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నవారికి ప్రతి కుటుంబానికి రూ.పాతికవేలు ఇస్తారు. ఆ పై అంతస్థుల్లో ఉన్నవారికి వారు పడిన ఇబ్బందులకు... పని పోయినందుకు పరిహారంగా ప్రతి కుటుంబానికి రూ. పది వేలు అందిస్తారు.

ఆర్దిక ప్యాకేజీ
పరిహారం ఇళ్లలో ఎవరు ఉంటే వారికే ఇస్తామని, అద్దెకు ఉండేవారు ఉంటే వారికే వ స్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. విజయవాడ నగరం, దానిని ఆనుకొని ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 172 వార్డు, గ్రామ సచివాలయాల పరిధిలో ఈ ప్యాకేజీ వర్తిస్తుంది. షాపులు, ఇతర వాణిజ్య సంస్ధలకు వాటిల్లిన నష్టం ఎక్కువగా ఉండటంతో వాటికి వేరే ప్యాకేజీ ప్రకటించారు. చిన్న కిరాణా షాపులు, టీ కొట్లకు రూ.పాతిక వేలు, వ్యాపారం కింద నమోదై రూ.నలభై లక్షల లోపు టర్నోవర్ ఉన్న వాణిజ్య సంస్ధలకు రూ.ఏభై వేలు, రూ.నలభై లక్షల నుంచి రూ.కోటిన్నర వరకూ టర్నోవర్ ఉన్న షాపులకు రూ.లక్ష వరకు ఇవ్వనున్నారు.
వరద విపత్తు బాధితులకు గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని పరిహారాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు ప్రకటించారు. వరద ముంపునకు గురైన ఇళ్లకు, దెబ్బతిన్న వ్యాపారులకు ప్రభుత్వం అండగా ఉండేలా బెస్ట్ ప్యాకేజీని అందించారు. (1/2) pic.twitter.com/NbDnzEe1xc
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 17, 2024
ప్రతీ ఇంటికి సాయం
ఇంత కంటే ఎక్కవ టర్నోవర్ ఉన్న వాణిజ్య సంస్ధలకు రూ. లక్షన్నర పరిహారంగా ఇస్తారు. ద్విచక్ర వాహనాల రిపేర్లకు రూ. మూడు వేలు ఇస్తారు. ఆటోలకు రూ. పది వేలు ఇస్తారు. తోపుడు బళ్ళు పోయినా... దెబ్బతిన్నా ప్రభుత్వం వాటిని ఉచితంగా సమకూరుస్తుంది. చేనేత పనివారి మగ్గం పూర్తిగా పోతే రూ.పాతిక వేలు ఇస్తారు. గేదెలు, ఆవులు చనిపోతే రూ.ఏభై వేలు ఇస్తారు. ఎద్దులు చనిపోతే ఒక్కోదానికి రూ. నలభై వేలు అందిస్తారు. పశువుల కొట్టం పోతే రూ. ఏడున్నర వేలు ఇస్తారు. ఇల్లు పూర్తిగా పోతే కొత్త ఇల్లు ఇస్తారు. పంట నష్టం కింద కొన్ని పంటలకు ఎకరానికి రూ. పది వేలు, కొన్ని వాణిజ్య పంటలకు రూ. 14 వేలు చంద్రబాబు ప్రకటించారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications