పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ - చంద్రబాబు..!!
ఏపీ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నేటితో ఎన్నికల నామినేషన్ల ఘట్టం పూర్తి కానుంది. పార్టీల అధినేతలు ప్రచార హోరు కొనసాగిస్తున్నారు. జగన్ బస్సు యాత్ర పూర్తయింది. నేడు పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అటు జగన్ లక్ష్యంగా చంద్రబాబు, పవన్ ప్రచారం చేస్తున్నారు. తాజాగా విజయనగరం లో ప్రచార సభలో పవన్ గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అధికారంలోకి రావటమే లక్ష్యంగా చంద్రబాబు - పవన్ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. విజయనగరం జిల్లాలోచంద్రబాబు, పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సభలో చంద్రబాబు పవన్ - జగన్ ను పోల్చుతూ కొన్నివ్యాఖ్యలు చేసారు. ఆ క్రమంలో నెత్తిన రూపాయి పెడితే ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ నోరు జారారు. జగన్ పైన విమర్శలు చేసే క్రమంలో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. అదే సభలో ప్రస్తుతం కరెంట్ కోతల గురించి చంద్రబాబు విమర్శలు చేస్తున్న సమయంలో లేవు కోతలు లేవు అంటూ సభకు హాజరైన వారి నుంచి లేవు అంటూ చేతులు ఊపటం కనిపించింది.

రాష్ట్రాన్నిబాగు చేసే బాధ్యత తాను మళ్లీ తీసుకుంటానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. విజయనగరం లో హైటెక్ టవర్స్ కడుతానని చెప్పుకొచ్చారు. జగన్ కు అహంకారం పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. దీని కారణంగానే తనను, పవన్ ను విమర్శించే స్థాయికి వెళ్లారని మండిపడ్డారు. బొత్స కుటుంబం జిల్లాను దోచేసేందని చంద్రబాబు విమర్శించారు. బొత్సా ఊడ్చేయగా మిగిలిన దానిని ఊడ్చేయటానికి వీరభద్ర స్వామి వచ్చారని ఫైర్ అయ్యారు. ఉత్తరాంధ్ర పైన విజయ సాయిరెడ్డి, సుబ్బారెడ్డి పెత్తనం ఏంటని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో 40 వేల కోట్లు దోచేసిన దొంగలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రామతీర్ధంలో జరిగిన ఘటనలో ఇప్పటి వరకు దోషులను పట్టుకోలేదన్నారు.
పవన్కళ్యాణ్ ని దారుణంగా అవమానించిన చంద్రబాబు
— Amar Amar (@amarballa2) April 24, 2024
నెత్తి మీద రూపాయి పెట్టి వేలం వేస్తే.. పైసాకి కూడా అమ్ముడుపోని వ్యక్తి పవన్ కళ్యాణ్ - చంద్రబాబు pic.twitter.com/VnHQa7xj3i












Click it and Unblock the Notifications