Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీ అభ్యర్ధుల లిస్టు రెడీ - జాబితాలో వీరే: గతం కంటే భిన్నంగా - "ముందస్తు"గా..!!

ఏపీలో ఎన్నికల మూడ్ వచ్చేసింది. దాదాపు ఏడాదిన్నారకు పైగా సమయం ఉన్నా...ప్రధాన పార్టీలు సై అంటున్నాయి. వైసీపీ - టీడీపీ ఇప్పటికే తమ అభ్యర్దులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. వైసీపీ నుంచి పార్టీ అధికారికంగా ప్రకటించకపోయినా..పార్టీ బాధ్యులు ఎక్కడికక్కడ తమ అభ్యర్ధులు ఎవరనేది స్పష్టత ఇస్తున్నారు. వైసీపీకి పోటీగా టీడీపీ సైతం తమ అభ్యర్ధులను ఫైనల్ చేస్తోంది. ఏ ఎన్నిక వచ్చినా నామినేషన్ చివరి సమయం వరకు అభ్యర్ధుల ఎంపిక పైన చంద్రబాబు తుది నిర్ణయానికి వచ్చే వారు కాదు. కానీ, ఇప్పుడు పార్లమెంటరీ జిల్లాల పర్యటనలో ఉన్న చంద్రబాబు.. అభ్యర్దులను ఖరారు చేయటం లో ముందస్తుగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏపీలో షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని టీడీపీ బలంగా విశ్వసిస్తోంది.

గతం కంటే భిన్నంగా చంద్రబాబు

గతం కంటే భిన్నంగా చంద్రబాబు

దీంతో..తన జిల్లాల పర్యటన సమయంలోనే వివాదాలు - సీటు కోసం పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ముందుగానే అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు. అందులో భాగంగా.. వచ్చే ఎన్నికల కోసం చంద్రబాబు తొలుత సీఎం జగన్ సొంత నియోజకవర్గంలో తమ అభ్యర్ధి ప్రకటన ద్వారా ఈ జాబితాలోని ఒక్కొక్కరి పేరును బయట పెడుతున్నారు. అదే విధంగా ఎంపీ అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు. కడప ఎంపీగా రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి పేరు ప్రకటించారు. రాజంపేట నుంచి గంటా నరహరి పోటీ చేస్తారని వెల్లడించారు. పెద్దిరెడ్డి ని ఎలాగైనా ఈ ఎన్నికల్లో టార్గెట్ చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. దీంతో..మిథున్ రెడ్డి పైన ఆర్దికంగా బలం ఉన్న నరహరి పేరును ఖరారు చేసారు. పెద్డిరెడ్డిని రానున్న ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలనేది చంద్రబాబు లక్ష్యం. ఈ విషయాన్ని ఆయన ఓపెన్ గానే చెప్పారు. అందులో భాగంగా.. పుంగనూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా చల్లా బాబురెడ్డి పోటీ చేస్తారని చంద్రబాబు ప్రకటించారు. అయితే, ఆయన పేరు ప్రకటించగానే అక్కడ పార్టీ సమావేశంలోనే గందరగోళం చోటు చేసుకుంది. బాబురెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీలోని సీనియర్ నేత రమణారెడ్డి సైతం టికెట్ ఆశించినా..పార్టీ అధినేత బాబు వైపే మొగ్గు చూపారు.

టార్గెట్ నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఖరారు

టార్గెట్ నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఖరారు

పీలేరులో పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పేరును ప్రకటించారు. పులివెందుల నుంచి వైఎస్సార్ హయాం నుంచి జగన్ వరకూ టీడీపీ అభ్యర్దిగా సతీష్ రెడ్డి పోటీ చేస్తూ వచ్చారు. ఆయనకు టీడీపీ ప్రభుత్వ హాయంలో శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ గా అవకాశం ఇచ్చారు. ఆయన కొంత కాలంగా పార్టీకి దూరమయ్యారు. దీంతో ఆయన స్థానంలో ప్రస్తుత ఎమ్మెల్సీ బీటెక్ రవిని పార్టీ అధినేత రానున్న ఎన్నికల్లో పులివెందుల అభ్యర్ధిగా ఖరారు చేసారు. కర్నూలు జిల్లాలో కేఈ క్రిష్ణమూర్తి కుటుంబం నుంచి ఒత్తిడి ఉన్నా.. డోన్ నియోజకవర్గం విషయంలోనూ చంద్రబాబు ముందుగానే అభ్యర్దిని నిర్ణయించారు. డోన్ లో ఆర్దిక మంత్రి బుగ్గన వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.డోన్‌లో ఈసారి టీడీపీ తరఫున ధర్మవరం సుబ్బారెడ్డి పోటీ చేయనున్నారు. ఆయన అభ్యర్ధిత్వం పైన స్థానికంగా టీడీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా...చంద్రబాబు నిర్ణయం ప్రకటించారు.

పొత్తుల క్లారిటీ తరువాతనే ఆ నియోజకవర్గాల్లో

పొత్తుల క్లారిటీ తరువాతనే ఆ నియోజకవర్గాల్లో

స్పీకర్ తమ్మినేని ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదాలవలసలోనూ టీడీపీ నుంచి మరోసారి మాజీ విప్‌ కూన రవికుమార్ పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు నిర్దారించారు. తమ్మినేని పైన విరుచుకుపడే కూన రవి స్పీకర్ తమ్మినేనికి బామమరిది అవుతారు. ఇక, కోనసీమ జిల్లా ముమ్ముడివరంలో మాజీ ఎమ్మెల్యే దాట్ల బాపిరాజుకే మరోసారి టికెట్ ఖరారు చేసారు. అదే సమయంలో..2019 ఎన్నికల్లో కొందరు ఎంపీలుగా పోటీ చేసిన వారు సైతం ఈ సారి ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగనున్నారు. ముందస్తు ఎన్నికలు ఖాయమని భావిస్తున్న ఈ సమయంలో..సాధ్యమైనంత త్వరగా అభ్యర్ధులను ఫైనల్ చేయాలని టీడీపీ అధినేత భావిస్తున్నారు. అయితే, పొత్తుల అంశం ఖరారు అయినా..ఇబ్బంది లేని నియోజకవర్గాల్లోనే ప్రస్తుతానికి అభ్యర్దులను ప్రకటిస్తున్నారు. పొత్తులు - ఎన్నికల పైన క్లారిటీ వచ్చిన తరువాత ఫైనల్ గా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+