దుర్మార్గుడు గుడివాడ వైసిపి అభ్య‌ర్ది:తిన్నింటి వాసాలు లెక్క‌పెట్టే ర‌కం: కొడాలి నాని పై చంద్ర‌బాబు.

టిడిపి అధినేత చంద్రబాబు గుడివాడ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. వైసిపి అభ్య‌ర్ది కొడాలి నాని పై విరుచుకు ప‌డ్డారు. ఎక్క‌డ పుట్టారు..ఎక్క‌డ పెరిగారు అంటూ నిల‌దీసారు. అవినాశ్ ఇక్క‌డే ఉంటూ అంద‌రికీ అందుబాటు లో ఉన్నాడ‌ని చెప్పుకొచ్చారు. నాని ని చిత్తు చిత్తుగా ఓడించాల‌ని పిలుపునిచ్చారు...

క్ష‌మించ‌టానికి వీల్లేదు..

క్ష‌మించ‌టానికి వీల్లేదు..

గుడివాడ ప్ర‌చారంలో టిడిపి అధినేత చంద్ర‌బాబు స్థానిక వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని పై విరుచుకుప‌డ్డారు. కొడాలి నాని ఎక్క‌డ పుట్టారు..ఎక్క‌డ పెరిగారు అని ప్ర‌శ్నించారు. ఆయ‌న సొంత పార్టీకే ద్రోహం చేసాడు..మ‌న పార్టీ ద్వారా ఇక్క‌డ ఎమ్మెల్యే అయ్యాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఆయ‌న పేరు ఎత్త‌కుండానే వైసిపి అభ్య‌ర్ది అంటూ ఫైర్ అయ్యారు. అటు వంటి వ్య‌క్తిని తిన్నింటి వాసాలు లెక్క‌పెట్టే వ్య‌క్తి అని దుయ్య‌బ‌ట్టారు. అత‌డిని క్ష‌మించటానికి వీల్లేద‌ని చెప్పుకొచ్చారు.
అటువంటి దుర్మార్గుడిని చిత్తుచిత్తుగా ఓడించాల‌ని పిలుపునిచ్చారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో డ‌బ్బు మూట్ల‌తో వ‌స్తాడ ని..ఆ త‌రువాత వ్యాపారం చేసుకుంటాడ‌ని చెప్పుకొచ్చారు. ఎంపి అభ్య‌ర్ది బాల‌శౌరి గురించి మాట్లాడారు. ఆయ‌న వ‌ల‌స ప‌క్షి అని..టిడిపి అభ్య‌ర్ది ని ఎంపీగా గెలిపించాల‌ని కోరారు.

 అవినాశ్ ఇక్క‌డే ఉంటాడు

అవినాశ్ ఇక్క‌డే ఉంటాడు

అవినావ్ ఇక్క‌డ అభ్య‌ర్దిగా ప్ర‌క‌టించ‌గానే..ఇక్క‌డే ఇల్లు కొనుక్కొని ఇక్క‌డే స్థిర ప‌డ్డాడ‌ని..మీ అంద‌రికీ అందుబాటులో ఉంటాడ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. కొంద‌రు నేత‌లు కుల ప్ర‌స్తావ‌న తెస్తున్నార‌ని తాను అన్ని కులాల‌ను..వ‌ర్గాల ను క‌లిపే ప‌నిలో ఉన్నాన‌ని పేర్కొన్నారు. వంగ‌వీటి రాధా..దేవినేని అవినాశ్ రెండో త‌రం నేత‌ల‌ని చెప్పుకొచ్చారు. త‌న హాయంలో క‌డ‌ప లో..క‌ర్నూలు లో ఉప్పు నిప్పు గా ఉండే నేత‌లు ఒక్క‌టిగా పార్టీ కోసం ప‌ని చేస్తున్నార‌ని వివ‌రించారు.
ఏపి ప్ర‌జ‌ల పై కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను చంద్రబాబు గుర్తు చేసారు. మోదీ..కేసీఆర్‌..జ‌గ‌న్ క‌లిసి ఏపి పై కుట్ర‌లు చే స్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ప‌ట్టిసీమ కు అడ్డుప‌డిన వ్య‌క్తి జ‌గ‌న్ అని..ఆ నీళ్లు తాగుతున్న మీరు జ‌గ‌న్ కు ఎలా ఓటు వేస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

 కాపుల ఓట్లు నాకే వేయాలి..

కాపుల ఓట్లు నాకే వేయాలి..

సుదీర్ఘ కాలం పెండింగ్ లో ఉన్న కాపు రిజ‌ర్వేష‌న్ల‌ను ఇచ్చింది తానే అని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. వైయ‌స్ హ‌యాం లో కాపుల‌ను మోసం చేసారన్నారు. కాపుల‌కు వెయ్యి కోట్లు ఇస్తాన‌ని చెప్పి ఇచ్చి మాట నిల‌బెట్టుకున్నాన‌ని వివ‌రించారు. కాపు రిజ‌ర్వేష‌న్ త‌న ప‌రిధిలో లేద‌ని చెప్పిన జ‌గ‌న్ కు కాపుల ఓటు అడిగే హ‌క్కు లేద‌న్నారు. కాపుల‌కు అయిదు వేల కోట్లు ఇచ్చిన త‌న‌కే వారి ఓట్లు వేయాల‌న్నారు. జ‌గ‌న్ కు ఓటు వేస్తే కేసీఆర్ కు వేసినట్లేన‌ని పేర్కొన్నా రు. పౌరుషం ఉన్న వారు ఎవ‌రైనా..టిడిపికి ఓటు వేయాల‌న్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+