వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ స‌మ‌స్యే లేదు..మోదీని అడ్డుకోవాలి: చ‌ంద్ర‌బాబు ఆందోళ‌న వెనుక‌.. : అందుకే ఢిల్లీకే ప్రాధాన్య‌త

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏపీలో ఫ‌లితాల కంటే..కేంద్రంలో స‌మీక‌ర‌ణాల పైనే ఎక్కువ‌గా దృష్టి పెడుతున్నారు. ఏపీలో త‌మ విజ‌యం అనే ధీమా ఒక్క‌టైతే..జ‌గ‌న్ కంటే ముందుగా మోదీని కేంద్రంలో అడ్డుకోవాల‌నేది ఆయ‌న ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ మోదీకి అనుకూలంగా ఉన్నా..చివ‌రి వ‌ర‌కు మోదీని నియంత్రించ‌టానికి చివ‌రి వ‌ర‌కూ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇందు కోసం ప్ర‌తీ ఒక్క‌రిని క‌లుస్తున్నారు. ఇంత‌కీ చంద్ర‌బాబు కేంద్రంలో మోదీ అధికారంలోకి రాకూడ‌ద‌ని ఇంత‌లా కోరుకోవ‌టం వెనుక అసలు క‌ధ ఏంట‌నేది ఇప్పుడు చ‌ర్చ‌..

జగన్, చంద్రబాబుల ఇళ్ళ వద్ద పోలీసు భద్రత పెంపు... అదనంగా రెండు కంపెనీల ఫోర్స్ పహారాజగన్, చంద్రబాబుల ఇళ్ళ వద్ద పోలీసు భద్రత పెంపు... అదనంగా రెండు కంపెనీల ఫోర్స్ పహారా

ఏపీని వ‌దిలి ఢిల్లీలో చంద్ర‌బాబు..

ఏపీని వ‌దిలి ఢిల్లీలో చంద్ర‌బాబు..

తాను అధికారంలోకి రావ‌టం ఖాయం అనే న‌మ్మ‌క‌మో..లేక ఏపీలో ఇక ఏం చేయ‌లేం..ఏపీ కంటే కేంద్రంలో మోదీని అడ్డుకోవ‌టం చాలా ముఖ్యం. ఇదే కార‌ణంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏపీలో ఫ‌లితాల పైన దృష్టి పెట్ట‌టం లేదు. ఆయ‌న ప్ర‌ధానంగా కేంద్రంలో మోదీని అడ్డుకోవ‌టం ఎలా అనే దాని పైనే ఢిల్లీలో అన్ని పార్టీలను క‌లిపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో తిరిగి మోదీ అధికారంలోకి రావటం ఖాయ‌మ‌ని చెబుతున్నా..చంద్ర‌బాబు త‌న ప‌ట్టు వీడ‌టం లేదు. విప‌క్షాల‌న్నింటిని క‌లిపి ఉంచితే..చివ‌రి నిమిషంలో అవ‌కాశం వ‌స్తుంద‌ని దీనికి అనుగుణంగానే మోదీకి అవ‌కాశం లేకుండా చేయాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. అయితే, దీని కోసం ఏపీని దాదాపు వ‌దిలేసారు. ఏపీలో త‌న‌కు అధికారం ఖాయ‌మ‌ని భావిస్తున్న చంద్ర‌బాబు..అస‌లు జ‌గ‌న్ అధికారంలోవి వ‌స్తే అనే ఆలోచ‌న కూడా ద‌గ్గ‌రికి రానివ్వ‌టం లేదు.

ఏపీలో అధికారం ఖాయ‌మ‌నే...

ఏపీలో అధికారం ఖాయ‌మ‌నే...

ఏపీలో త‌న‌కే ఓట‌ర్లు ప‌ట్టం క‌ట్టార‌నే బ‌ల‌మైన ధీమా చంద్ర‌బాబులో క‌నిపిస్తోంది. త‌న పిలుపుతోనే మ‌ధ్నాహ్నం నుండి ఓట‌ర్లు త‌ర‌లి వ‌చ్చార‌నే అభిప్రాయంతో చంద్ర‌బాబు ఉన్నారు. ఏపీ కాకుండా ఇత‌ర ప్రాంతాల నుండి వ‌చ్చిన వారు సైతం త‌న‌కే ఓటు వేసార‌ని చంద్ర‌బాబు న‌మ్మ‌కం. ఎగ్జిట్ పోల్స్ వ‌చ్చినా..వారంతా ఓట‌రు నాడి ప‌ట్టుకోవ‌టంలో ఫెయిల్ అయ్యార‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. తాము 1983 నుండి స‌ర్వేలు చేస్తున్నామ‌ని..అండ‌ర్ క‌రెంట్ ఉంద‌ని చెబుతూ..సైలెంట్ ఓటింగ్ జ‌రిగింద‌ని విశ్లేషిస్తున్నారు. ఏపీలో జ‌రిగిన ఓటింగ్ ఎవ‌రికీ అంతు చిక్క‌ద‌ని చెప్పుకొచ్చారు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చే స‌మ‌స్యే లేద‌నే అతి న‌మ్మ‌కం ఆయ‌న‌లో ఆయ‌న‌లో క‌నిపిస్తోంది. తాను ఉండ‌గా ప్ర‌జ‌లు జ‌గ‌న్‌ను ఆద‌రించ‌ర‌నేది ఆయ‌న న‌మ్మకం.

 మోదీని ఎందుకు అడ్డుకోవాలంటే..

మోదీని ఎందుకు అడ్డుకోవాలంటే..

ప్ర‌ధానిగా తిరిగి మోదీకి అవ‌కాశం రాకుండా అడ్డుకోవాల‌ని చంద్ర‌బాబు భావించ‌టం వెనుక బ‌ల‌మైన కార‌ణాలున్నాయి. ఏపీలో త‌న అధికారం ఖాయ‌మ‌నుకుంటున్న చంద్ర‌బాబు మోదీ మళ్లీ ప్రధాని అయితే రాష్ట్రానికి ఇబ్బందులు తప్పవని.. కేంద్రం నుంచి తగిన సహాయం అభించే అవకాశం లేదని భావిస్తున్నారు. దీంతోపాటు టీడీపీని కూడా కేంద్రం రాజకీయంగా ఇక్కట్లపాలు చేసే అవకాశాలున్నాయి. ఈ కార‌ణంతోనే మళ్లీ మోదీ రావొద్దు అనే లక్ష్యంతో చంద్రబాబు జాతీయ స్థాయిలో విపక్షాలను ఏకం చేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం సీఎం ఢిల్లీ టూర్ పైన ఆరోప‌ణ‌లు చేస్తోంది. మోదీ అధికారంలోకి వ‌స్తే చంద్ర‌బాబు చేసిన అవినీతి పైన విచార‌ణ‌కు ఆదేశిస్తార‌నే భ‌యం ఆయ‌న్ను వెంటాడుతోంద‌ని ఎద్దేవా చేస్తున్నారు. క‌నీసం..విప‌క్షాల నేత‌లైనా త‌న వెనుక ఉంటే వారి మ‌ద్ద‌తుతో అయినా నెట్టుకురావాల‌నేదే చంద్ర‌బాబు ప్ర‌య‌త్నంగా వారు ఆరోపిస్తున్నారు.

English summary
TDP Chief Chandra Babu seriously concentrated to unite opposition parties to face Modi would not be come PM. Babu seem to be no worry on AP Election Results. He confident on his winning in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X