నా శిష్యుడి తెలివి నాకు తెలియదా : మహేష్ ఫ్యాన్స్ సత్తా చాటాలి : చంద్రబాబు హాట్ కామెంట్స్..!
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు హాట్ కామెంట్లు చేసారు. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు వైసిపి నుండి టిడిపిలోకి చేరారు. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు కారణమయ్యాయి. గోద్రా అల్లర్ల సమయంలో మోదీని రాజీ నామా చేయాలని డిమాండ్ చేసానని..అందుకే ఇప్పుడు వేధిస్తున్నారని సీయం అన్నారు.
నా శిష్యుడి గురించి నాకు తెలియదా..
ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడారు. పేదరికమే నా కులం అంటూ సీయం ఏపి లో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. ఎన్టీఆర్ టీటీడీలో అన్నదానాన్ని ప్రారంభిస్తే.. తాను ఆంధ్ర ప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లను ప్రారంభించానని చెప్పారు. గోద్రా అల్లర్ల సమయంలో మోదీని రాజీనామా చేయాలని నా డు డిమాండ్ చేసానని..అది మనసులో పెట్టుకొని ఇప్పుడు వేధిస్తున్నారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

కేసీఆర్ తన కంటే గొప్పవాడని ప్రధాని చేసిన వ్యాఖ్యలను సీయం ప్రస్తావించారు. కెసీఆర్ పరిణితితో వ్యవహరించారని అవి శ్వాస తీర్మానం చర్చ సందర్బంగా నాడు ప్రధాని వ్యాఖ్యానించారు. తన శిష్యుడైన కేసీఆర్ తెలివి తేటలు తనకు తెలి యనవా అని సీయం చెప్పుకొచ్చారు. నా శిష్యుడి గురించి నాకే చెబుతున్నారని సీయం పేర్కొన్నారు.
మహేష్ బాబు ఫ్యాన్స్ గట్టిగా పని చేయాలి
ఘట్టమనేని ఆదిశేషగిరి రావుతో పాటుగా అనేక మంది కృష్ణ- మహేష్ బాబు ఫ్యాన్స్ టిడిపి లో చేరారు. వారందరినీ పార్టీ లోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాబోయే రెండు నెలల్లో కృష్ణ-మహేశ్‌బాబు అభిమానులు గట్టిగా పని చేసి అభిమానుల సత్తా ఏమిటో చూపించాలన్నారు.

ఆదిశేషగిరిరావును ఆదర్శంగా తీసుకుని మరింత మంది ముందు కు రావాలన్నారు. మరో అయిదేళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉందని ఆదిశేషగిరి రావు పేర్కొన్నారు. అయితే, రాజకీయంగా ఆదిశేషగిరి రావుకు టిడిపి లో ఎలాంటి ప్రాధాన్యత లభిస్తుందనేది ఇంకా స్పష్టత లేదు.












Click it and Unblock the Notifications