• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పవన్ గెలిచి ఉంటే మరోలా ఉండేది: అందుకే అక్కడ ప్రచారం విషయంలో: చంద్రబాబు మనసులో మాట..!

|
  Chandra Babu Reveled His Opinion On Pawan Kalyan Defeat In Gajuwaka || చంద్రబాబు మనసులో మాట..!

  టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ పైన మమకారం చూపించారు. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన చోట ఎందుకు ప్రచారం చేయలేదో ఇప్పుడు వివరించారు. నాడు వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రచారం నిజమే అనే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు కనిపిస్తున్నాయనే విశ్లేషణలు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ గెలిచి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని వ్యాఖ్యానించారు. ఇక, బీజేపీతోనూ తాను వ్యవహరించిన తీరు సరి కాదనే అభిప్రాయం వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో విభేదించాం. దాని వల్ల నష్టపోయాం.. రాష్ట్రానికి లాభం జరగలేదు.. పార్టీకి నష్టం జరిగింది.. అది పెట్టుకోకుండా ఉంటే ఇంకో విధంగా ఉండేదంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రయోజనం పొందిన ప్రజలు సైతం తనకు సహకరించలేదని వాపోయారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యల ద్వారా మరో సారి రాజకీయంగా ఏపీలో ఆసక్తి కర చర్చ సాగుతోంది..

  సీఎం జగన్ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్! పసుపు రంగు పడింది!! కేసులు కూడా..

   అందుకే గాజువాక ప్రచారానికి రాలేదు..

  అందుకే గాజువాక ప్రచారానికి రాలేదు..

  టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా గాజువాక నేతలతో సమావేశమయ్యారు. ఆ సమయంలో తాజా ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చింది. అక్కడ చంద్రబాబు పర్యటించకపోవడంపై 30 వేల మంది టీడీపీ క్రియాశీల కార్యకర్తలలో సందేహం ఏర్పడిందని నియోకవర్గానికి చెందిన ఒక నేత చంద్రబాబుకు వివరించారు. అదే సమయంలో వైసీపీ నేతలు సైతం పదే పదే చంద్రబాబు..వపన్ మధ్య తెర వెనుక పొత్తు నడుస్తోందని..అందులో భాగంగానే చంద్రబాబు జనసేన అదినేత పవన్ పోటీ చేస్తున్న గాజువాక..భీమవరం లో ప్రచారం చేయటం లేదని పదే పదే ప్రచారం చేసారు. దీనిని టీడీపీ నేతలు చంద్రబాబు ముందు ప్రస్తావించారు. కనీసం ఆరోపణలను టీడీపీ సరిగ్గా తిప్పికొట్టలేక పోయిందని..దీంతో టీడీపీ కార్యకర్తల్లో అనుమానం పెరిగిందని స్థానిక నేతలు చెప్పుకొచ్చారు. దీనికి పార్టీ అధినేత చంద్రబాబు సమాధానం ఇచ్చారు. తాను ఎందుక గాజువాకలో ప్రచారానికి రాలేదో చెప్పుకొచ్చారు.

  పవన్ తో హుందాగా ఉండాలనే..

  పవన్ తో హుందాగా ఉండాలనే..

  ఇదే అంశం పైన చంద్రబాబు స్పందిస్తూ.. ఒక పార్టీ అధ్యక్షుడు పట్ల హుందాతనం ప్రదర్శించాలనే ఉద్దేశంతోనే తాను పర్యటించలేదని స్పష్టంచేశారు. ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా టీడీపీపై ఉంటుందనే ఆలోచన చేశామే తప్ప ఎవరితోనూ మనకు లాలూచీ లేదని చెప్పారు. ఒకవేళ ఏదైనా ఆలోచన చేస్తే బహిరంగంగా పొత్తు పెట్టుకునేవాళ్లమని వ్యాఖ్యానించారు. గాజువాకలో తాను పర్యటించకపోవడం వల్ల టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుకు కొంత ఇబ్బంది ఎదురైందని అంగీకరించారు. తాను పర్యటించి ఉంటే కొన్ని ఓట్లు పెరిగి ఉండేవన్నారు. గాజువాకలో టీడీపీ అభ్యర్థి శ్రీనివాసరావు బాగా పనిచేశారని చెబుతూనే.. అక్కడ పవన్‌ కల్యాణే గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తి కరంగా మారాయి. అంటే అక్కడ తమ పార్టీ అభ్యర్ధి కాకుండా పవన్ కళ్యాణ్ గెలవాలని టీడీపీ అధినేత కోరుకున్నారా అనే చర్చ మొదలైంది.

  పట్టుదలకు పోయి ఇబ్బందులు తెచ్చుకున్నాం..

  పట్టుదలకు పోయి ఇబ్బందులు తెచ్చుకున్నాం..

  బీజీపీతో తాను వ్యవహరించిన వైఖరి మీద చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఎట్టి పరిస్థితుల్లో జరగాలనే పట్టుదలకు పోయాం.. దాంతో కొంతవరకు ఇబ్బంది వచ్చిందని చంద్రబాబు అంగీకరించారు. లేకపోతే ఇలా ఉండేది కాదన్నారు. ప్రజ ల్ని నమ్ముకున్నామని... ప్రయోజనం పొందినవారు సహకరించలేదంటూ చంద్రబాబు నిర్వేదం వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో విభేదించామని చెబుతూనే... దానివల్ల రాష్ట్రానికి లాభం జరగలేదు.. పార్టీకి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసారు. అది పెట్టుకోకుండా ఉంటే ఇంకో విధంగా ఉండేదన్నారు.. ఆ చాప్టర్‌ ఈజ్‌ ఓవర్‌ అంటూనే భవిష్యత్‌లో ఎటువంటి తప్పు లేకుండా చూసుకోవాలి. ..అప్రమత్తంగా ఉండాలంటూ చంద్రబాబు నేతలకు పిలుపునిచ్చారు. ఇక, చంద్రబాబు ఎన్నికల సమయం నుండి మనసులో ఉన్న విషయాలను ..అంతర్మధనాన్ని ఇప్పుడు విశాఖలో బయట పెట్టినట్లుగా కనిపిస్తోందనే విశ్లేషణలు మొదలయ్యాయి.

  English summary
  TDP Chief Chandra babu Reveled his opinion on Pawan Kalyan defeat in Gajuwaka. Babu say if pawan won in assembly election situation will be different. He also said that fight with central govt caused loss for party in lost elections.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more