అధికారులకు తేల్చి చెప్పిన చంద్రబాబు, ఇక నుంచి..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. అధికారులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణం గా పని చేయాలని స్పష్టం చేసారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా పాలన ఉండాలని నిర్దేశించారు. ఆన్ లైన్ సేవలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. ప్రజా సేవకు వీలుగా అవసరమైన రీతిలో బిజినెస్ రూల్స్ మార్పు చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అధికారులకు శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించారు.
సంక్షేమ, అభివృద్ధి పథకాలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులను వాడుకోవడానికి తమ ప్రభుత్వం నూతన నిబంధనలు తెచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శాఖాధి పతులతో చంద్రబాబు సమావేశమయ్యారు. కొందరు నెగటివ్‌కు అలవాటు పడ్డారని విమర్శిం చారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సమర్థంగా వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ రికార్డులు ఇకపై కొరియర్‌లో పంపిస్తామని ప్రకటించారు. ప్రతి కంపెనీకి క్రెడిట్ రేటింగ్ ఉంటుందని.. అలాంటి వారికి అప్పులు తక్కువ వడ్డీకి ఇస్తారని వివరించారు. ప్రజలకు ఇచ్చిన హమీని నిలబెట్టకున్నామని.. సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ డేటాను ఇంటిగ్రేట్ చేశామని.. పబ్లిక్ పర్ఫెక్షన్‌ను ఒకప్పుడు ఇంటెలిజెన్స్ నుంచి తీసుకునేవాళ్లమని చెప్పారు.

తనకు అలవాటుగా ప్రతిరోజు ఇంటెలిజెన్స్ వారిని కలుస్తానని వివరించారు. హైదరాబాద్‌లో ఉండగా డీజీ, ఇంటెలిజెన్స్ చీఫ్, తర్వాత సీఎస్ వచ్చేవారన్నారు. చారిత్రక డేటా మన వద్ద ఉందని.. ప్రతిరోజు వారీ డేటా అప్‌డేట్ చేస్తున్నామని చెప్పారు. అవేర్ ద్వారా రియిల్ టైం డేటా వస్తోంది. లాస్ట్ మైల్‌కు రియల్ టైంలో చేర్చగలుగుతామని వివరించారు. మనం టెక్నాలజీలో చాలా స్ట్రాంగ్‌గా ఉన్నామని.. గ్రీన్ ఎనర్జీని అన్ని దేశాలు ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. మైక్రో సాఫ్ట్ దేశంలో రూ.1. 55వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అవుతోందని వెల్లడించారు. ఇప్పుడు చేయాల్సింది హర్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్. ఇండస్ట్రీయల్ పార్కులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మనదే. ఎనర్జీ లిప్టింగ్‌కు రూ.10వేల కోట్లు ఖర్చుచేస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. కరెంట్ ఛార్జీలు పెంచమని మరోసారి స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications