వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అభ్య‌ర్దుల‌ను కాదు..న‌న్ను చూసి ఓటెయ్యండి : బాబు కొత్త పోక‌డ‌: అభ్య‌ర్దుల పై వ్య‌తిరేక‌త కార‌ణ‌మా..!

|
Google Oneindia TeluguNews

ఏపిలోని 175 అసెంబ్లీ..25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు టిడిపి అభ్య‌ర్దుల‌ను ప్ర‌క‌టించింది. వారిని గెలిపించాలంటూ జోరు గా ప్ర‌చారం సాగిస్తోంది. అయితే, స‌డ‌న్ గా చంద్ర‌బాబు త‌న వాయిస్ మార్చేసారు. అభ్య‌ర్దుల‌ను చూసి కాదు.. త‌న‌ను చూసి ఓటెయ్యాల‌ని అభ్య‌ర్దిస్తున్నారు. ప్ర‌తీ చోటా తానే అభ్య‌ర్ది అంటూ ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో..ఇప్పు డు అభ్య‌ర్దులు డైల‌మాలో ప‌డుతున్నారు. ఇది త‌మ‌కు..పార్టీకి క‌లిసి వ‌స్తుందా..విక‌టిస్తుందా అనే చ‌ర్చ మొద‌లైంది. అయితే..చంద్ర‌బాబు ఇలా చెప్ప‌టానికి అస‌లు కార‌ణం ఏంటంటే..

న‌న్ను చూసి ఓటెయ్యండి...వారిని కాదు..

న‌న్ను చూసి ఓటెయ్యండి...వారిని కాదు..

టిడిపి అభ్య‌ర్దుల‌కు విచిత్ర ప‌రిస్థితి ఎదురైంది. చంద్ర‌బాబు త‌న ఎన్నిక‌ల ప్ర‌చారం లో నిన్న‌..మొన్న‌టి వ‌ర‌కు టిడిపి అభ్య‌ర్దుల‌ను ప్ర‌జాభిప్రాయం మేర‌కే ఎంపిక చేసామ‌ని..వారిని గెలిపించాల‌ని కోరారు. అయితే, స‌డ‌న్ గా చంద్ర‌బాబు త‌న వాయిస్ మార్చేసారు. అభ్య‌ర్దుల‌ను కాకుండా..త‌న‌ను చూసి ఓటెయ్యాల‌ని అభ్య‌ర్దిస్తున్నారు. ప్ర‌జ‌లు కోరుకున్న వారినే అభ్య‌ర్దులుగా ప్ర‌క‌టించిన త‌రువాత ఈ ప‌రిస్థితి ఎందుకొచ్చొంద‌ని ఇప్పుడు చ‌ర్చ మొద‌లైంది. ఎవ‌రో త‌ప్పు చేసారనో..ఎవ‌రో ప‌ట్టించుకోలేద‌నో ఇలాంటి కార‌ణాల‌ను మ‌న‌సులో పెట్టుకోవ‌ద్ద‌ని..త‌న‌ను చూసి ఓటెయ్యాల‌ని ప‌దే ప‌దే అభ్య‌ర్దిస్తున్నారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో..25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ తానే అభ్య‌ర్దిని చెబుతు న్నారు. దీని పై ఇప్పుడు టిడిపిలో కొత్త చ‌ర్చ మొద‌లైంది. దీని కార‌ణంగా పార్టీకి క‌లిసి వ‌స్తుందా..మొత్తానికే న‌ష్టం చే స్తుందా అని డైల‌మా పార్టీలో మొద‌లైంది.

క‌లిసి వ‌స్తుందా...విక‌టిస్తుందా..

క‌లిసి వ‌స్తుందా...విక‌టిస్తుందా..

పార్టీ ఖ‌రారు చేసిన అభ్య‌ర్దుల‌ను కాకుండా.. త‌న‌ను చూసి ఓటెయ్య‌మ‌ని కోర‌టం ద్వారా స్థానికంగా బ‌రిలో ఉండే అభ్య ర్దుల‌కు గుర్తింపు లేకుండా చేస్తున్నార‌నే అభిప్రాయ‌మూ ఉంది. అదే స‌మ‌యంలో అభ్య‌ర్దుల‌తో సంబంధం లేదు...అ న్నీ తానే చూసుకుంటాన‌నే హామీ ద్వారా ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌వ్వ‌టానికే ఇలా చెప్పార‌ని టిటిపి నేత‌లు విశ్లేషిస్తున్నారు. ఇక‌, ఎప్పుడూ త‌మ‌కు అందుబాటులో ఉన్నార‌నే ఓటు వేసే స‌మ‌యంలో..అభ్య‌ర్ది పై న‌మ్మ‌కం లేద‌నే విధంగా చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు ఓట‌ర్ల పై నెగ‌టివ ప్ర‌భావం చూపిస్తాయనే విశ్లేష‌ణ వినిపిస్తోంది. ఎన్నిక‌లు చాలా రోజులు ముందుగానే 40 శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాల‌ని..లేకుంటే ఎన్నిక‌ల్లో ప్ర‌తికూల ఫ‌లితాలు వ‌స్తాయ‌ని జేసి దివాక‌ర్ రెడ్డి లాంటి వారు చాలాసార్లు వ్యాఖ్యానించారు. అయితే, ఎన్నిక‌ల ప్ర‌చారంలోకి దిగిన త‌రువాత వ‌స్తున్న ఫీడ్‌బ్యాక్ కు అను గుణంగానే చంద్ర‌బాబు అభ్య‌ర్దుల‌ను కాదు..త‌న‌ను చూడ‌మంటున్నార‌నేది మ‌రో విశ్లేష‌ణ‌.

ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు (ఫొటోలు)

అభ్య‌ర్దుల్లో కొత్త డైల‌మా..

అభ్య‌ర్దుల్లో కొత్త డైల‌మా..

త‌మను గెలిపించ‌మ‌ని కోరాల్సిన పార్టీ అధినేత తానే బ‌రిలో ఉన్నాన‌ని చెప్ప‌టం ద్వారా త‌మ‌కు విలువ లేకుండా పోతుంద‌నే ఆందోళ‌న అభ్య‌ర్దుల్లో వ్య‌క్తం అవుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న తమ కు ఈ ర‌క‌మైన ప్ర‌చారం ద్వారా క్షేత్ర స్థాయిలో వ్య‌తిరేక ప్ర‌భావం ప‌డుతుంద‌ని వారి ఆవేద‌న‌గా తెలుస్తోంది. ఇక‌, చంద్ర‌బాబు చేస్తున్న వ్యాఖ్య ల ద్వారా ప‌రోక్షంగా అభ్య‌ర్దులు స‌మ‌ర్ధులు కాద‌నే అభిప్రాయం ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని టిడిపి నేత‌లే అందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో..చివ‌రి రెండు రోజుల ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు ఏం చెబుతార‌నే ఉత్కంఠ టిడిపి అభ్య‌ర్దుల్లో క‌నిపిస్తోంది.

English summary
TDP Cheif Chandra babu new comments in election campaign. Babu appealed voters that do not see candidates vote for me. This slogan creating confusion in TDP Candidates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X