అన్నా అంటూ తియ్యగా - తన్నిఅవతల పారేశారు : రఘురామను చంపేసేవారేమో- చంద్రబాబు..!!
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ వ్యవహారం పైన టీడీపీ అధినేత..ప్రతిపక్ష నేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. గతంలో సీఎస్ గా ఎన్న ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ అంశాన్ని ప్రస్తావించారు. దీంతో.. రఘురామ రాజు అంశం పైన ఆయన తీవ్ర విమర్శ చేసారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన సర్పంచ్ లకు అవాగహన శిబిరంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి.
సీఎం జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు సెటైర్లు వేసారు.

తియ్యగా పిలిచారు..తన్ని అవతలకు
"అధికారంలోకి రాగానే.. అధికారులను అన్నా అంటూ తియ్యగా పిలిచారు. వారంతా ఉబ్బితబ్బిబయ్యారు. అన్నా అంటూనే ముందు చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని, తర్వాత డీజీపీ సవాంగ్‌ను తన్ని అవతల పారేశారు. వాడుకుని వదిలేయడంలో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ప్రావీణ్యం ఏమిటో అందరికీ తెలిసిపోయిందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. సవాంగ్ పరిస్థితి చూసి జాలిపడుతున్నాం తప్ప.. సమర్థించడం లేదన్నారు. ఆయన పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఏకపక్షంగా పనిచేశారంటూ ఫైర్ అయ్యారు. అమరావతి లో పర్యటన సమయంలో తన కాన్వాయ్‌పై వైసీపీ వాళ్లు రాళ్లు వేస్తే.. భావ ప్రకటన స్వేచ్ఛ అని సమర్థించారని దుయ్యబట్టారు. మంత్రి అప్పలరాజు సీఐపై దాడి చేస్తే ఏ చర్యా తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.

రఘురామను చంపేసేవారేమో
దీనికి కొనసాగింపుగా రఘురామ రాజు అంశాన్ని ప్రస్తావించారు. కోర్టులు లేకపోతే ఎంపీ రఘురామరాజును ఏం చేసేవారో.. చంపేసేవారేమో..అంటూ చంద్రబాబ వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి పాత్రను సీబీఐ చార్జిషీట్లో పెడితే సమాధానం చెప్పలేక దర్యాప్తు సంస్థ కక్ష కట్టిందంటూ సలహాదారు సజ్జలతో చెప్పించారని ఫైర్ అయ్యారు. ప్రతిపక్షంలో ఉండగా జగన్‌రెడ్డి అబద్ధాలను కూడా అతికేలా ప్రచారం చేయగలిగారని, ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉండగా వివేకానందరెడ్డిని హత్య విషయంలో టీడీపీనే చంపిందిదని ఆరోపణలు చేసిన వారే... ఇప్పుడు ఆ హత్యలో తనవారి పాత్ర ఉందని బయటపడగానే సీబీఐని తిట్టడం మొదలు పెట్టించారని చెప్పుకొచ్చారు.

సవాంగ్ విషయంలో ప్రభుత్వ ఆలోచన ఏంటి
గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన్ను జీఏడీలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. అయితే, తాజాగా ఆయనకు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా నియమించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఐపీఎస్ అధికారికగా సవాంగ్ కు ఇంకా 17 నెలల పదవీ కాలం ఉంది. ఇక, సవాంగ్ బదిలీ కారణాల పైన అనేక రకాలు గా చర్చ సాగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం సవాంగ్ బదిలీకి కారణాలు చెప్పాలని డిమాండ్ చేసారు. గతంలో ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ విషయం ఇదే తరహాలో జరిగిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు చంద్రబాబు సైతం ..ఇదే తరహాలో స్పందించారు. కానీ, మంత్రులు మాత్రం అధికారుల బదిలీలు ప్రభుత్వం నిర్ణయం మేరకు జరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. సవాంగ్ కు లేని బాధ టీడీపీకి ఎందుకుని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు..సవాంగ్ విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయం అమలు చేయబోతుందనేది ఆసక్తి కరంగా












Click it and Unblock the Notifications