వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెలికాఫ్ట‌ర్ లో మోదీ డ‌బ్బులు త‌ర‌లిస్తున్నారు : స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ అభూతం:..ఇసి పై బాబు ఫైర్‌..!

|
Google Oneindia TeluguNews

ప్ర‌ధాని మోదీ..ఎన్నిక‌ల సంఘం పై టిడిపి అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండి ప‌డ్డారు. ప్ర‌ధాని మోదీ సర్జిక‌ల్ స్ట్రైక్స్ అంటూ అభూత క‌ల్ప‌న చేస్తున్నార‌ని ఆరోపించారు. 350 మంది ఉగ్ర‌వాదులు మ‌ర‌ణించార‌ని చెబుతున్నార‌ని.. ఏ అంత‌ర్జాతీయ మీడియా అయినా దీనిని నిర్ధారించిందా అని ప్ర‌శ్నించారు. మోదీ క‌నుస‌న్న‌ల్లో ఎన్నిక‌ల సంఘం ప‌ని చేస్తుంద‌ని విమ‌ర్శించారు. 50 శాతం వివి ప్యాట్స్ లెక్కేయ‌టానికి ఎన్నిక‌ల సంఘానికి ఇబ్బంది ఏంట‌ని నిల‌దీసి న చంద్ర‌బాబు..దీని పై జాతీయ స్థాయిలో పోరాటం కొన‌సాగిస్తామ‌ని స్ప‌ష్టం చేసారు.

<strong>స‌ర్వేలు ప్రారంభం..పోలింగ్ పూర్త‌యినా : నాడి అర్దం కాని అభ్య‌ర్దులు : 40 రోజుల టెన్ష‌న్ త‌ప్పుదు..!</strong>స‌ర్వేలు ప్రారంభం..పోలింగ్ పూర్త‌యినా : నాడి అర్దం కాని అభ్య‌ర్దులు : 40 రోజుల టెన్ష‌న్ త‌ప్పుదు..!

స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ అభూత క‌ల్ప‌న‌..

స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ అభూత క‌ల్ప‌న‌..

ప్ర‌ధాని మోదీ పై టిడిపి అధినేత చంద్ర‌బాబు తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. ప్ర‌ధాని ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా త‌న హెలి కాఫ్ట‌ర్ లో డ‌బ్బులు త‌ర‌లిస్తున్నార‌ని చెబుతున్నార‌ని వ్యాఖ్యానించారు. ఇక‌, స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ అంటూ అభూత క‌ల్పన చేస్తున్నార‌ని ఆరోపించారు. ఈ స్ట్రైక్స్ లో 350 మంది ఉగ్ర‌వాదులు మ‌ర‌ణించార‌ని ప్ర‌చారం చేస్తున్నార‌ని.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ అంతర్జాతీయ మీడియా అయినా దీనిని ధృవీక‌రించిందా అని ప్ర‌శ్నించారు. పాక్ ప్ర‌ధాని సైతం దాడులు జ‌ర‌గ‌లేద‌ని చెబుతున్నార‌ని..అదే ప్ర‌స్తావిస్తే తాము పాకిస్థాన్ ప్ర‌ధానికి మ‌ద్ద‌తుగా మాట్లాడ‌మ‌ని ప్ర‌చారం చేస్తున్నార‌ని..తాజాగా మోదీని పాక్ ప్ర‌ధాని అభినందించార‌ని..అంటే పాక్ ప్ర‌ధాని తో మోదీ కుమ్మ‌క్కు అయిన‌ట్లా అని చంద్ర‌బాబు నిల‌దీసారు. ఏపిలో గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో చివ‌రి ద‌శ‌లో పెడితే..ఇప్పుడు తొలి ద‌శ‌లో ఎందుకు పెట్టార‌ని ప్ర‌శ్నించారు. మోదీ ఎలా చెబితే ఎన్నిక‌ల సంఘం అలా చేస్తుంద‌ని ఆరోపించారు.

స్ట్రాంగ్ రూముల్లోనూ ర‌క్ష‌ణ లేదు ...

స్ట్రాంగ్ రూముల్లోనూ ర‌క్ష‌ణ లేదు ...

ఎన్నిక‌ల సంఘాన్ని తాము ఒక్క‌టే డిమాండ్ చేస్తున్నామ‌ని..50 శాతం వివిప్యాట్స్ స్లిప్పుల‌ను లెక్కించాల‌ని కోరారు. ఎన్నిక‌ల సంఘం ఓట‌ర్ల మ‌నోభావాల‌తో ఆడుకుంటుంద‌న్నారు. ఎన్నిక‌ల సంఘంతో తాను చ‌ర్చ జ‌రిపిన స‌మ‌యం లో స్ప‌ష్ట‌త రాలేద‌న్నారు. వివి ప్యాట్ల మీద న‌మ్మ‌కం లేక‌పోతే 9 వేల కోట్లు ఎందుకు ఖ‌ర్చు చేసార‌ని నిల‌దీసారు. తాను 2014 లోనూ..ఇప్పుడూ ఇవియం ల‌పై అసంతృప్తితోనే ఉన్నాన‌న్నారు. కోర్టుకు త‌ప్పుడు ఎఫిడ‌విట్లు ఇస్తున్నారని ఆరో పించారు. స్ట్రాంగ్ రూం ల్లో ఇవియం లు పెట్టిన త‌రువాత కూడా ర‌క్ష‌ణ ఉండ‌టం లేద‌ని ..మేమే వాటిని ర‌క్షించుకోవా ల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌న్నారు. ఎన్నిక‌ల సంఘం 50 శాతం వివి ప్యాట్స్ లెక్కించేందుకు అంగీక‌రించే వ‌ర‌కూ త‌మ పోరాటం ఆగ‌ద‌న్నారు. జాతీయ స్థాయిలో ప్రతీ చోట దీని పై నిల‌దీస్తామ‌ని స్ప‌ష్టం చేసారు. వ‌ద‌లిపెట్టే ప్ర‌సక్తే లేద‌ని తేల్చి చెప్పారు.

 150 ప్ల‌స్ సీట్లు మావే..

150 ప్ల‌స్ సీట్లు మావే..

కొంద‌రు తాను ఎన్నిక‌ల్లో ఓడిపోతాన‌నే ఇవియం ల‌పై మాట్లాడుతున్నార‌ని అంటున్నార‌ని..అస‌లు ఎందుకు ఓడిపో త‌నంటూ ప్ర‌శ్నించారు. ఓట‌ర్లు ఉధృతంగా పోలింగ్ లో పాల్గొన్నార‌ని..ఏపిలో ఉన్న ప‌రిస్థితి అర్దం చేసుకొని ఇత‌ర ప్రాంతాల నుండి ఓట‌ర్లు త‌ర‌లి వ‌చ్చి ఓట్లు వేసార‌ని వివ‌రించారు. హైద‌రాబాద్ లో ఉన్న అభ‌ద్ర‌తా భావాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్క‌డ ఓటింగ్ లో పాల్గొన్నార‌ని విశ్లేషించారు. ఓటు వేసి తిరిగి వెళ్లే వారికి బ‌స్సులు ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేయ‌లేకోయినందుకు సిగ్గు ప‌డుతున్నాన‌ని వ్యాఖ్యానించారు. వారంతా ప్ర‌జా స్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోసం వ‌చ్చిన వార‌ని సీయం పేర్కొన్నారు. టిడిపి కి 15 ప్లస్ వ‌స్తాయ‌ని ధీమా వ్య‌క్తం చేసారు. సీఈవో మీద చంద్ర‌బాబు మ‌రో సారి కామెంట్లు చూసారు. ద్వివేదీ ఏమైనా సాంకేతిక నిపుణుడా..మొన్న‌టి దాకా నా ద‌గ్గ‌ర ప‌ని చేసిన వ్య‌క్తి అని వ్యాఖ్యానించారు.

English summary
TDP Chief Chandra Babu serious comments on Modi and Election commission. Babu says Surgical strikes are bogus. Eelction commission must go for count 50 percent of polled votes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X