జ‌గ‌న్ ఆర్‌య‌స్‌య‌స్ నేత‌ల‌ను క‌లుస్తున్నారు : నా పైనే నిఘా పెడ‌తారా: చ‌ంద్ర‌బాబు ఫైర్‌..!

పోలింగ్ తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ టిడిపి అధినేత చంద్ర‌బాబు వైసిపి అధినేత జ‌గ‌న్ పై విమ‌ర్శ‌ల దాడి తీవ్ర‌త‌రం చేసారు. జ‌గ‌న్ మోదీతో కుమ్మ‌క్క‌య్యార‌ని క్రైస్త‌వ మ‌త‌బోధ‌కుల స‌మావేశంలో వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ టిఆర్‌య‌స్ తో పాటుగా ఆర్‌య‌స్‌య‌స్ నేత‌ల‌తో స‌మావేశాలు జ‌రుపుతున్నార‌ని ఆరోపించారు.

ప్ర‌ధాని పై తీవ్ర వ్యాఖ్య‌లు..

ప్ర‌ధాని పై తీవ్ర వ్యాఖ్య‌లు..

ప్ర‌ధాని మోదీ పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. మోదీ ఉన్మాది అని వ్యాఖ్యానించిన చంద్ర‌బాబు త‌న ఇంటి పై నిఘా పెట్టార‌న్నారు. ఓ ముఖ్య‌మంత్రి నివాసం పై నిఘా పెడ‌తారా అని ప్ర‌శ్నించారు. త‌మ పార్టీ అభ్య ర్దుల పై ఐటి దాడులు చేయిస్తున్నార‌ని..వీరు ఎన్ని దాడులు చేస్తే ప్ర‌తీ దాడికి ఓ ప‌ది సీట్లు పెరుగుతాయ‌ని వివ‌రించా రు. క్రిస్టియ‌న్ మ‌త‌బోధ‌కుల‌తో చంద్ర‌బాబు స‌మావేశ‌మ‌య్యారు. మోదీ ఉన్మాదం దేశానికి న‌ష్టం చేస్తుంద‌న్నారు. దే శం లోని మైనార్టీల ఓట్లు తీసేసినా ఆశ్చ‌ర్య పోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.సీబిఐ, ఈడీ, ఐటి సంస్థ‌ల‌ను మోదీ దు ర్వినియోగం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.మోదీ ఓ దుర్మార్గుడు అంటూ ఊగిపోయిన చంద్ర‌బాబు అధికారం శాశ్వ‌తం కాద‌ని గుర్తించాల‌న్నారు. మోదీని ఢిల్లీ నుండి గుజ‌రాత్ కు త‌రిమికొడ‌తామ‌న్నారు.

జ‌గ‌న్ ఆర్‌య‌స్‌య‌స్ తో సంబంధాలు

జ‌గ‌న్ ఆర్‌య‌స్‌య‌స్ తో సంబంధాలు

వైసిపి అధినేత జ‌గ‌న్ పైనా ముఖ్య‌మంత్రి తీవ్ర విమ‌ర్శ‌లు చేసారు. లోట‌స్ పాండ్ లో కూర్చొని ఏపి పై కుట్ర‌లు చేస్తు న్నార‌ని ఆరోపించారు. కేసుల మాఫీ కోసం మోదీతో..ఆస్తుల కోసం కేసీఆర్ తో జ‌గ‌న్ లాలూయీ ప‌డ్డాడ‌ని విమ‌ర్శించా రు. టిఆర్‌య‌స్‌..ఆర్‌య‌స్‌య‌స్ నేత‌ల‌తో జ‌గ‌న్ క‌లుస్తున్నార‌ని ఆరోపించారు. కుర్చీ కోసం జ‌గ‌న్ అడ్డ‌దారులు తొక్కు తున్నార‌ని విమ‌ర్శించారు. మోదీ..కేసీఆర్‌..జ‌గ‌న్ ఏపికి ద్రోహులుగా అభివ‌ర్ణించారు. మోదీ భ‌జ‌న చేసే జ‌గ‌న్ కు క్రిస్టి య‌న్లు మ‌ద్ద‌తిస్తారా అని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ త‌న పై గ‌తంలో చేసిన వ్యాఖ్య‌ల‌ను చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు. జ‌గ‌న్ కు ఓటు వేస్తే ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లేన‌ని వ్యాఖ్యానించారు.

క్రిస్టియ‌న్లు మ‌ద్ద‌తిస్తారా..

క్రిస్టియ‌న్లు మ‌ద్ద‌తిస్తారా..

బిజెపికి మిత్రుడుగా ఉంటూ మోదీకి దాసోహం అయిన జ‌గ‌న్ కు క్రిస్టియ‌న్లు మ‌ద్ద‌తిస్తారా అని చంద్ర‌బాబు నిల‌దీసారు. బిజేపికి బానిస‌గా మారిన వైసీపికి ముస్లింలు ఓలా ఓటేస్తారు అని ప్ర‌శ్నించారు. మ‌నం ఏం మాట్లాడాలో.. ఏం తినాలో వీళ్లు డిసైడ్ చేస్తారా అని ఫైర్ అయ్యారు. మోదీ పై తిర‌గ‌బ‌డిన తొలి నాయ‌కుడిని తానేన‌ని చెప్పుకొచ్చారు. ఎన్నిక‌ల్లో ఏపి ప్ర‌జ‌లు ఈ ముగ్గురి కుట్ర‌ల‌ను తిప్పి కొడ‌తార‌ని..ఓటుతో బుద్ది చెబుతార‌ని చెప్పుకొచ్చారు చంద్ర‌బాబు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+