వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుకాలం వ‌స్తోంది: ఎగ్జిట్ పోల్స్ వ్య‌తిరేక‌మే.. కంగారు ప‌డ‌ద్దు : మ‌ంత్రుల‌తో సీఎం చంద్ర‌బాబు..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మంత్రుల‌తో కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. మంత్రుల‌తో స‌మావేశ‌మైన స‌మ‌యంలో ఎన్నిక‌ల ఫ‌లితాల పైన వ‌చ్చే ఎగ్జిట్ పోల్స్ గురించి చ‌ర్చ‌కు వ‌చ్చింది. అదే విధంగా విజ‌యం టీడీపీదే అంటూ చంద్ర‌బాబు మ‌రోసారి ధీమా వ్య‌క్తం చేసారు. కేంద్రంలో బిజేపీ వ‌చ్చే అవ‌కాశం లేద‌నే అభిప్రాయం మంత్రుల‌తో స‌మావేశ స‌మ‌యంలో వ్యక్తం అయింది.

రాహుకాలం వ‌స్తోంది..కంగారు ప‌డ‌ద్దు
ప్ర‌స్తుత ఏపీ ప్ర‌భుత్వంలో చివ‌రి కేబినెట్ స‌మావేశం ఎన్నిక‌ల సంఘం అనుమ‌తితో నిర్వ‌హించారు. దీనికి ముందుగా మంత్రుల‌తో సీఎం చంద్ర‌బాబు స‌మావేవమ‌య్యారు. ఆ సంద‌ర్భంలో ఏపీ ఎన్నిక‌ల‌తో పాటుగా జాతీయ రాజ‌కీయాలు పైనా చ‌ర్చ జ‌రిగింది. ఆ స‌మ‌యంలోనే ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి అనుకూలంగా రావ‌టం పైనా చ‌ర్చ సాగింది. ఆ స‌మ‌యంలో మంత్రులు చేస్తున్న చ‌ర్చ‌లో సీఎం జోక్యం చేసుకున్నారు. ఆ స‌మ‌యంలో చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ఈనెల 19న వ‌చ్చే ఎగ్జిట్ పోల్స్‌లో కూడా టీడీపీని గంద‌ర‌గోళానికి గురి చేసేలా లెక్క‌లు వ‌చ్చినా కంగారు ప‌డ‌వ‌ద్ద‌ని చంద్ర‌బాబు మంత్రుల‌కు సూచించారు. టీడీపీ ఖ‌చ్చితంగా గెలుస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేసారు. స‌మావేశం ముగిస్తూ..రాహుకాలం వ‌స్తుంది అంటూ స‌మావేశం ముగించి కేబినెట్ స‌మావేశానికి వెళ్లారు.

Chandra Babu suggested Ministers do not feel tension with exit polls : TDP will be win..

మోదీ ప్ర‌ధాని కారు..కానివ్వ‌రు
మంత్రుల‌తో స‌మావేశ స‌మ‌యంలో కేంద్రంలో ఎన్నిక‌ల ఫ‌లితాల పైన ఆసక్తి క‌ర చ‌ర్చ సాగింది. ప్ర‌దాని మోదీ పైన సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న సెటైర్ల పైనా చ‌ర్చించారు. మంత్రి సోమిరెడ్డి ఏకంగా మోదీ పైన సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న కామెంట్ల‌ను వివ‌రించారు. అయితే, చంద్ర‌బాబు సైతం ప్ర‌ధాని విష‌యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. మోదీ విధానాలు..వైఖ‌రిని జాతీయ స్థాయిలో పూర్తి స్థాయిలో ఎండ‌గ‌ట్ట లేక‌పోయార‌ని సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు. దేశ వ్యాప్తంగా జ‌రుగుతున్న పోలింగ్ ట్రెండ్స్ చూస్తోంటో..ఎన్డీఏకు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అవ‌కాశం క‌నిపించ‌టం లేద‌ని చంద్ర‌బాబు విశ్లేషించారు. ఒక వేళ ఎన్డీఏకు అవ‌కాశం వ‌చ్చినా మోదీని ప్ర‌ధానిగా త‌ప్పిస్తార‌నే ప్ర‌చారం గురించి మ‌రో మంత్రి వివ‌రించారు. మోదీని త‌ప్పిస్తే గ‌డ్క‌రీ లేదా రాజ్‌నాధ్ సింగ్‌కు అవ‌కాశం వ‌స్తుంద‌ని మంత్రులు పేర్కొన్నారు. అయ‌తే, ముఖ్య‌మంత్రి మాత్రం 23వ తేదీ నుండి క్రియాశీల‌కంగా వ్య‌వ‌హరించాల్సి ఉంటుంద‌ని వివ‌రించారు.

English summary
AP Cm Chandra Babu said to ministers that dont feel tension with exit polls which to be coming on 19th of this month. Babu once again confident on winning in Elections. He says Modi will not be come Pm once again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X