రూటు మార్చిన చంద్రబాబు - మోదీ మార్క్, కీలక నిర్ణయం..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. 1995 తరహా నిర్ణయాలు అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. ప్రధాని మోదీ మార్క్ మన్ కీ బాత్ లాంటి కార్యక్రమాలకు సిద్దం అవుతున్నారు. అదే విధంగా డయల్ యువర్ సీఎం నిర్వహించాలని భావిస్తున్నారు. పాలన తో పాటుగా ఎక్కువగా ప్రజల్లోనే ఉండాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. జమిలి ఎన్నికల ప్రచారం వేళ.. రాజకీయంగా పట్టు కొనసాగించేలా వ్యూహాలు రచిస్తున్నారు. సంక్రాంతి నుంచి చంద్రబాబు తన రూటు మార్చేందుకు సిద్దమయ్యారు.
కొత్త ప్రణాళికలు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక ప్రజలతో మమేకం కావాలని భావిస్తున్నారు. ఇందు కోసం కొత్త కార్యక్రమాలకు రూప కల్పన చేస్తున్నారు. ప్రజలతో నిరంతరం టచ్ లో ఉండే ముఖ్యమంత్రి గా కొనసాగాలే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందు కోసం డయల్ యువర్ సీఎం తరహాలో కొత్త కార్యక్రమానికి రూప కల్పన జరుగుతోంది. జనవరిలో జన్మభూమి -2 ప్రారంభించనున్నారు. అదే విధంగా సంక్రాంతికి సూపర్ సిక్స్ లో మరో పథకం ప్రారంభం దిశగా కసరత్తు చేస్తున్నారు. అదే విధంగా సంక్రాంతి వేళ ప్రజలతో ముఖాముఖి అయ్యేలా కొత్త కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇక, జిల్లాల పర్యటనలు.. ప్రజలతో నేరుగా చర్చలు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు.

ముఖా ముఖి కార్యక్రమాలు
ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన సమయం నుంచి ప్రజలతో మన్ కీ బాత్ నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని రంగాల ప్రజలతో మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమానికి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు అదే తరహాలో చంద్రబాబు సైతం ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో 150 రోజుల పాలన పైన ప్రసంగించిన చంద్రబాబు ఇక ప్రజల్లోనే ఉందామంటూ పిలుపునిచ్చారు. గ్రామాల్లో స్వయంగా పర్యటిస్తానని ప్రకటించారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ద్వారా ఎన్డీయే ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా పాలన కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
ప్రజలతో మమేకం
2014- 19 కాలంలో పూర్తిగా పాలనా పరమైన అంశాల పైనే ఫోకస్ చేయటంతో ఆ తరువాత 2019 ఎన్నికల్లో నష్టపోయామని.. అటువంటి పొరపాట్లు మరోసారి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందు కోసం ప్రభుత్వం..పార్టీ మధ్య సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా కసరత్తు జరుగుతోంది. అటు కేంద్రంలో జమిలి ఎన్నికల దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జమిలి బిల్లు ప్రవేశ పెట్టటం ద్వారా ఎన్నికల నిర్వహణ పైన స్పష్టత రానుంది. దీంతో, రాజకీయంగా తాజా ఎన్నికల్లో దక్కిన పట్టు కొనసాగించేలా చంద్రబాబు కొత్త ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు.












Click it and Unblock the Notifications