జగన్ పార్టీలో స్మగ్లర్లు, దోపిడిదారులు: చంద్రబాబు ఫైర్
చిత్తూరు: అభివృద్ధికి మారు పేరు తమ తెలుగుదేశం పార్టీ అని, అవినీతికి మారు పేరు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. సీమాంధ్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం చిత్తూరు జిల్లా సత్యవేడులో రోడ్ షో నిర్వహించారు. వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ఆయన విరుచుకుపడ్డారు. విరుచుకుపడ్డారు.
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకుని ప్రజల పొట్టకొట్టిందని మండిపడ్డారు. ప్రజల కోపానికి కాంగ్రెస్ పార్టీ అడ్రసు లేకుండా పోయిందన్నారు. పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని, రైతులకు రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహిళల కోసం ప్రవేశపెట్టిన అనేక పథకాలు మాయమయ్యాయన్నారు.

తాము అధికారంలోకి వచ్చాక మహిళలకు రుణాలు మాఫీ చేసి డ్వాక్రా సంఘాలను ఆదుకుంటామని, ఆడబిడ్డలకు రక్షణ కల్పించే బాధ్యత తమదేనని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో స్మగ్లర్లు, దోపిడీదారులకే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారని ఆయన అన్నారు. మంగళవారం ఉదయం శ్రీకాళహస్తిలో బాబు రోడ్ షో నిర్వహించారు.
జగన్ వస్తే సీమాంధ్రలో జైలు గోడలు వెలుస్తాయని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకాళహస్తిని మోడరన్ టౌన్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తి రాజగోపురాన్ని పునర్నిర్మించే సత్తా తమ పార్టీకి మాత్రమే ఉందని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications