టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవం..!
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు రెండో రోజు సమావేశాల్లో ఈ మేరకు పార్టీ ఎన్నికల కమిటీ ఛైర్మన్ వర్ల రామయ్య అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత సభ వేదిక పైనే ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రతి రెండేళ్లకోసారి అధ్యక్షుడిని ఎన్నుకోవడం పార్టీలో ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ఈసారి కూడా పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక కోసం పిలుపునిచ్చారు. అయితే చంద్రబాబు ఒక్కరే నామినేషన్ వేశారు. ఇతర అభ్యర్థులు ఎవరూ పోటీలో లేకపోవడంతో ఆయన్ని ఏకగ్రీవంగా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన ఈ పదవిలో మరొక రెండేళ్లు కొనసాగనున్నారు.

చంద్రబాబు తొలిసారి 1995లో టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి గత 30 ఏళ్లుగా ఎలాంటి విరామం లేకుండా ఈ పదవిలో కొనసాగుతూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. రాష్ట్ర విభజన (2014) వరకు రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న ఆయన.. ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
దీంతో అనుభవం, నాయకత్వ నైపుణ్యం, పార్టీపై ఆయనకు ఉన్న పట్టుదల, ప్రజల సమస్యలపై చేస్తున్న కృషి వంటివి చంద్రబాబును మరోసారి అగ్రస్థానానికి చేర్చాయని ఆయన అభిమానులు కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. చంద్రబాబును ఈ పదవికి ఎన్నుకోవడం ద్వారా పార్టీలో ఆయన నాయకత్వం పట్ల ఉన్న విశ్వాసం, మద్దతు మరోసారి స్పష్టమైందని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నేతలు ఈ నిర్ణయానికి సమ్మతిని తెలియజేశారు. పలువురు మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.
ఇక చంద్రబాబు మాట్లాడుతూ.. తన ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ కొనసాగుతుందని.. తన బలం, బలగం తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. తనపై కార్యకర్తలు ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటానన్నారు.
-
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications