వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేరగాళ్ళ రాష్ట్రంగా ఏపీ .. వైసీపీ ఫాసిస్టు మూకలు రెచ్చిపోతున్నాయని చంద్రబాబు ఫైర్

|
Google Oneindia TeluguNews

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లు వద్ద టిడిపి నేతలపై వైసీపీ నేతల దాడికి తెగబడ్డారు అని మండిపడిన చంద్రబాబు వైసిపి దాడిని తీవ్రంగా ఖండించారు. టిడిపి నేతలను గాయపరచడం వారి వాహనాలను ధ్వంసం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు బీ.కొత్తకోట లో మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించడం కోసం వెళుతున్న నాయకులపై దాడి చేయడం దారుణమని పేర్కొన్నారు.

Eluru Illness Update: ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించండి: ఏలూరు వింత వ్యాధిపై జగన్ కు చంద్రబాబు లేఖ Eluru Illness Update: ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించండి: ఏలూరు వింత వ్యాధిపై జగన్ కు చంద్రబాబు లేఖ

 వైసీపీ దాడులకు భయపడేది లేదన్న చంద్రబాబు .. టీడీపీ నేతలకు పరామర్శ

వైసీపీ దాడులకు భయపడేది లేదన్న చంద్రబాబు .. టీడీపీ నేతలకు పరామర్శ

చిత్తూరు జిల్లాలో వైసీపీ దాడిలో గాయపడిన టిడిపి నేతలను చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. వైసీపీ దాడులకు భయపడేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. దాడి చేసిన వారిని వదిలేసి గాయపడిన వారిని అరెస్టు చేశారని వైసీపీ ప్రభుత్వంపై, పోలీసుల తీరుపై విమర్శల వర్షం కురిపించారు. వైసిపి దౌర్జన్యాలకు ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్న చంద్రబాబు, దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పరామర్శ కు వెళుతున్న నాయకులపై దాడి చేయడం గర్హనీయమన్న చంద్రబాబు జగన్ ఫాసిస్ట్ పాలనకు ఈ దాడులు అద్దం పడుతున్నాయని మండిపడ్డారు.

 రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా కు గండి కొట్టారని చంద్రబాబు ఫైర్

రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా కు గండి కొట్టారని చంద్రబాబు ఫైర్

రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా కు గండి కొట్టారని చంద్రబాబు, తక్షణమే నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి నేరగాళ్ల రాష్ట్రంగా మార్చారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

జగన్ అండతోనే వైసీపీ నేతలు, ఫాసిస్టు మూకలు రెచ్చిపోతున్నారు అని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ నాయకులు , కార్యకర్తలపై దాడులు దౌర్జన్యాలకు అంతేలేకుండా పోయిందని ఎవరు ఏం చేయరన్న ధీమాతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు అని చంద్రబాబు విమర్శించారు.

ఏడాదిన్నరగా రాష్ట్రంలో అశాంతి, అభద్రత

ఏడాదిన్నరగా రాష్ట్రంలో అశాంతి, అభద్రత


ఏడాదిన్నరగా రాష్ట్రంలో అశాంతి, అభద్రత నెలకొందని పేర్కొన్న చంద్రబాబు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల పై దాడులు జరగని రోజు లేదంటూ విమర్శించారు. ప్రతిరోజు బీసీ, ఎస్సీ ,ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై దమనకాండ కొనసాగుతుందని, అరాచకాలను నియంత్రించే వ్యవస్థ లేకుండా పోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పేదలు సామాన్యులకు రక్షణ లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు వైసీపీ దాడులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణుల దాడి .. టీడీపీ నేతల ఆగ్రహం

టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణుల దాడి .. టీడీపీ నేతల ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నాటి నుండి నేటి వరకు అనేక సందర్భాల్లో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ దాడులపై మండి పడుతూనే ఉన్నారు. తాజాగా తంబళ్లపల్లె పర్యటన నిమిత్తం రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, పీలేరు నియోజకవర్గ ఇంచార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వెళుతున్న క్రమంలో వారి పై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. టిడిపి నేతల వాహనాలను ధ్వంసం చేశారు.
ఈ క్రమంలోనే టీడీపీ నేతలు ఈ దాడిపై మండిపడుతున్నారు.

English summary
Chandrababu, who was incensed that YCP leaders attack on TDP leaders at Angallu in Kurabalkota zone of Chittoor district , strongly condemned the YCP attack. Chandrababu who was outraged at the TDP leaders being injured and their vehicles being vandalized, said it was atrocious to attack leaders who were going to visit the families of deceased party workers in B.Kottakotta. The YCP fascist gang was provocative
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X