నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కు బీసీల రిటర్న్ గిఫ్ట్-అధికారమిస్తే దానిమీదే తొలి సంతకం- చంద్రబాబు కామెంట్స్

|
Google Oneindia TeluguNews

ఏపీలో బీసీల సంక్షేమంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో విపక్ష నేత చంద్రబాబు ఇవాళ ఓ కీలక ప్రకటన చేశారు. తాను అధికారంలోకి వస్తే బీసీల సంక్షేమంపై తొలి సంతకం చేస్తానన్నారు. అలాగే వైఎస్ జగన్ కు బీసీలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని చంద్రబాబు జోస్యం చెప్పారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన బీసీల సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

నెల్లూరు జిల్లా, కావలిలో ''ఇదేం ఖర్మ మన బీసీలకు'' కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. బీసీలకు చంద్రబాబు వెన్నుదన్ను, జగన్ వెన్నుపోటు పేరిట ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
మూడున్నరేళ్లలో 26మంది బీసీలను జగన్మోహన్ రెడ్డి హత్య చేయించాడని ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో బీసీల వృత్తి పరికరాలను తిలకించి చంద్రబాబు మగ్గం నేశారు. రాష్ట్రంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యాక్రమంలో భాగంగా అన్ని వర్గాల ప్రజలతో సమీక్షలకు శ్రీకారం చుట్టామని, వివిధ వర్గాల ప్రజల నుండి సమస్యలు నేను నేరుగా తెలుసుకుని న్యాయం చేసేందుకు సమీక్ష చేస్తున్నానని చంద్రబాబు తెలిపారు.

chandrababu announced his first signature on bc welfare file, return gift to ys jagan

బీసీల్లో 140 పైగా కులాలు ఉన్నాయని, టీడీపీకి బీసీలే వెన్నెముక అని చంద్రబాబు పేర్కొన్నారు. బీసీలకు న్యాయం చేసే వరకు టీడీపీ అండగా ఉంటుందన్నారు. బీసీలు టీడీపీ ఆవిర్భావం ముందు..ఆవిర్భావం తర్వాత ఎలా ఉన్నారనేది ఆలోచించాలన్నారు. టీడీపీకి ముందు బీసీలను ఓటర్లుగానే చూశారని, కానీ ఎన్టీఆర్ వచ్చాక బీసీల స్థితిగతులపై సమీక్ష చేశారన్నారు. బీసీలు రాజకీయ, ఆర్థిక, సామాజికంగా తీర్చిదిద్దాలని ఎన్టీఆర్ నిర్ణయించారన్నారు.బీసీలకు మంత్రులు, ఎమ్మెల్యేలుగా టీడీపీ అవకాశం ఇచ్చిందని, యనమల రామకృష్ణుడు,కె.ఇ.కృష్ణమూర్తి, దేవేందర్ గౌడ్, కొల్లు రవీంద్ర లాంటి బీసీ నేతలకు ఉన్నత పదవులు ఇచ్చింది టీడీపీనే అని చంద్రబాబు గుర్తుచేశారు.

chandrababu announced his first signature on bc welfare file, return gift to ys jagan

ఏ పదవుల్లోనైనా బీసీలకు న్యాయం చేయాలని ఆలోచించి అవకాశాలు కల్పించామని చంద్రబాబు తెలిపారు. బీసీలు రాజ్యాధికారంలో భాగస్వాములైతే నిర్ణయాలు కూడా సమర్థవంతంగా అమలవుతాయన్నారు. స్దానిక సంస్థల్లో మొదటి సారిగా 24 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించామని, సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీలు అయ్యారన్నారు.బీసీలల్లో నాయకులకు కొదవలేదంటే అది టీడీపీ స్పూర్తే నన్నారు. ఎన్టీఆర్ 24 శాతం రిజర్వేషన్లు ఇస్తే..తాను వచ్చాక 34 శాతానికి పెంచానన్నారు. కానీ జగన్ వచ్చాక 24 శాతానికి తగ్గించాడన్నారు. దీంతో బీసీలు 16,800 పదవులు కోల్పోయారని, ఇది బీసీల పట్ల జగన్ కు ఉన్న వివక్ష అన్నారు.

వెనకబడిన వర్గాలను నాయకులుగా చేస్తున్న ఫ్యాక్టరీ టీడీపీ అని చంద్రబాబు తెలిపారు. 40 ఏళ్లుగా బీసీలకు ప్రాధాన్యం ఇస్తూనే ఉన్నామని, నాయకుడు తయారవ్వడం చాలా కష్టమని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ నాయకుడిపై బురదజల్లడం సులభమన్నారు. కొల్లు రవీంద్ర నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి అని, ఆయన నాయకత్వాన్ని వైసీపీలోని నాయకత్వం జీర్ణించుకోలేకపోయిందన్నారు. మచిలీపట్నంలో హత్య జరిగిందని, ఫోన్లో మాట్లాడినందుకు కొల్లు రవీంద్రను హత్యలో ప్రమేయముందని అక్రమంగా అరెస్టు చేశారన్నారు. సొంత బాబాయి వివేకానందరెడ్డిని చంపిన నిందితులకు కాపాడుతున్న జగన్ ను జైల్లో పెట్టాలన్నారు.

English summary
tdp chief chandrababu on today announced that he will put first signature on bc welfare file once he comes into power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X