తిరుపతి టీడీపీ అభ్యర్థిగా సుగుణమ్మ, బాబు అప్పీల్
హైదరాబాద్: తిరుపతి శాసన సభ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకటరమణ సతీమణి సుగుణమ్మను నిలబెడుతున్నట్లు టీడీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి ప్రకటించారు.
బుధవారం చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో ఆయన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం తిరుపతి అభ్యర్థిని ప్రకటించారు. సుగుణమ్మకు అందరు మద్దతివ్వాలని ఆయన కోరారు. వెంకటరమణ ప్రజల మనిషి అని, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేవారన్నారు.
కాగా, చిత్తూరు జిల్లా తిరుపతి శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకటరమణ మృతి నేపథ్యంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈసీ సంఘం దేశ వ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్స్‌ను సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా తిరుపతి శాసన సభ నియోజకవర్గానికి ఫిబ్రవరి 13న ఎన్నికల నిర్వహించనున్నారు. 16న ఓట్లు లెక్కించాలని ప్రటించించింది. వెంకటరమణ అనారోగ్య కారణాలతో మృతి చెందారు. దీంతో వెంకటరమణ సతీమణి సుగుణా వెంకటరమణకు టీడీపీ టిక్కెట్టు ఇచ్చి ఇతర పార్టీల సహకారంతో ఆమె ఎన్నికను ఏకగ్రీవం చేయాలన్న ఆలోచనలతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏకగ్రీవానికి ప్రతిపక్షాలు సహకరిస్తాయా? లేక పోటీకి సై అంటాయా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు నెరిపిన వెంకటరమణ కుటుంబానికి అవసరమైనప్పుడు సహకరిస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఈ సహకారం వెంకటరమణ సతీమణి సుగుణ ఏకగ్రీవ ఎంపికకు దోహదపడుతుందని వెంకటరమణ వర్గీయులు గట్టిగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications