ఎన్నికలు అప్పుడే-సిద్ధం కండి-టీడీపీ నేతలకు చంద్రబాబు హింట్..!

దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న వేళ ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ టీడీపీ నేతలకు కీలక హింట్ ఇచ్చారు. రాష్ట్రంలో తాజాగా అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఎలా మసలుకోవాలో నేతలకు సూచించిన చంద్రబాబు పనిలో పనిగా వచ్చే ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో జమిలి ఎన్నికలపై జరుగుతున్న చర్చ మరో టర్న్ తిరిగినట్లయింది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని వరుసగా మూడోసారి నడుపుతున్న ప్రధాని మోడీపై జమిలి ఎన్నికలకు ఇప్పటికే తన అంగీకారం తెలిపిన చంద్రబాబు ఇవాళ పార్టీ నేతల భేటీలో చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది.

రాష్ట్రంలో ఈసారి గెలిచిన టీడీపీ యువ నేతలంతా జాగ్రత్తగా ఉండాలని, కార్యకర్తలను గౌరవించాలని చంద్రబాబు సూచించారు. అలాగే త్వరలో రాష్ట్రంలో రెండో విడత నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని మరోసారి తెలిపారు. దీంతో పాటు 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని కూడా నేతలకు చంద్రబాబు సూచించారు. దీంతో 2027లో జమిలి ఎన్నికలు ఉంటాయన్న చర్చకు చంద్రబాబు తెర దించారు.

Chandrababu ask tdp leaders to prepare for 2029 elections amid simultaneous polls plans

దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్రం పావులు కదుపుతున్న నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2026 నుంచి 2028 వరకూ నియోజకవర్గాల పునర్విభజన ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు కీలకంగా మారాయి. మరోవైపు తాజా ఎన్నికల్లో కేంద్రంలో ఏ ప్రాంతీయ పార్టీకీ దక్కని గౌరవం టీడీపీకి దక్కిందని చంద్రబాబు నేతలకు తెలిపారు. అలాగే కూటమిలో ప్రతి ఒక్కరూ మిత్ర ధర్మం పాటించాలని సూచించారు. కూటమిలో మిత్రపక్,ాలు జనసేన, బీజేపీని కలుపుకొని పోవాలని వారిని కోరారు. చిన్న చిన్న సమస్యలు వస్తే పరిష్కరించుకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+