గల్లా జయదేవ్‌కు చంద్రబాబు బంపర్ ఆఫర్..?
గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు కీలక పదవి ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. 2014, 2019 వరుస ఎన్నికల్లో గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా విజయం సాధించారు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనాన్ని తట్టుకుని మరీ ఆయన విజయం సాధించారు. అయితే పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో , వైసీపీ ప్రభుత్వంలో ఆయన చాలా ఇబ్బందులను ఫేస్ చేశారు.
వ్యాపార కార్యకలాపాలను వైసీపీ సర్కార్ దెబ్బ తీయడంతో గల్లా జయదేవ్ క్రియాశీల రాజకీయాలు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో కూటమి సర్కార్ ఘన విజయం సాధించడంతో గల్లా జయదేవ్‌కు చంద్రబాబు కీలక బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నారు. ఏపీలో నామినేటెడ్ పదవులు త్వరలో భర్తీ చేయడానికి రంగం సిద్ధమవుతోంది.

ఈక్రమంలో గల్లా జయదేవ్‌కు కీలక పదవి అప్పగించాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవిని గల్లా జయదేవ్‌కు కేటాయించాలని టీడీపీ అధినేత ఆలోచనగా తెలుస్తోంది. గతంలో ఈ బాధ్యతలను కంభంపాటి రామ్మోహన్ రావు వహించేవారు. ఈసారి ఆ పదవిని గల్లా జయదేవ్‌కు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో అధికార ప్రతినిధిగా గల్లా జయదేవ్ సరిపోతారని చంద్రబాబు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. 2014 నుంచి 24 వరకు గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా గల్లా జయదేవ్ కొనసాగారు.
10 ఏళ్ల పాటు జాతీయ రాజకీయాలను దగ్గరుండి చూసిన వ్యక్తి కావడంతోనే గల్లా జయదేవ్ వైపు చంద్రబాబు మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన జయదేవ్ వైసీపీ సర్కార్ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అవసరమైతే త్వరలో తాను రాజకీయాల్లోకి వస్తానని అప్పుడే చెప్పారు. అందుకే పార్టీ కోసం కృషి చేసిన గల్లా జయదేవ్ అయితే ఢిల్లీలో రాష్ట్ర ప్రతినిధిగా సరిపోతారని చంద్రబాబు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో రాష్ట్ర ప్రతినిధిగా గల్లా జయదేవ్ నియామకం దాదాపు ఖరారు అయినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications