గోవిందుడే: బాబు, కాళ్లుమొక్కబోతే వారించిన బాలయ్య
చిత్తూరు: తిరుమలలో గోవింద నామం తప్ప మరొకటి వినపడకుండా చర్యలు తీసుకుంటామని కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. ఆయన ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
తిరుమలలో గోవింద నామం తప్ప మరొకటి వినిపించవద్దన్నారు. ఏరా, రారా, పోరా.. అలాంటివి వినిపించవద్దన్నారు. అన్ని విధాలుగా అపవిత్రమైన తిరుమలను సమూలంగా ప్రక్షాళన చేస్తానన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందిస్తామని చెప్పారు.
భక్తులకు అందించే ప్రాణదానం (ఉచిత వైద్య సదుపాయం) పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. స్వామి వారి అనుగ్రహంతో కొత్త రాష్ట్రంలో అవినీతి రహిత, పేదరికం లేని సమాజం కోసం పాటుపడతామన్నారు.

కాళ్లు మొక్కబోతే వారించిన బాలయ్య
హిందూపురం టిడిపి ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన ఆలయం వెలుపలకు వచ్చాక ఆయనకు పలువురు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పుష్పగుచ్ఛ ఇచ్చి అభినందనలు తెలిపారు.
ఈ సమయంలో ఓ అభిమాని బాలకృష్ణకు పాదాభివందనం చేయబోయాడు. అవాక్కయిన బాలయ్య ఇదేమిటి.. ఇది తప్పు అంటూ వారించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications