ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాబు, హరికృష్ణ, బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్ నివాళి
హైదరాబాద్: ఎన్టీఆర్ 92వ జయంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద గురువారం ఉదయం ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, పలువురు ప్రముఖులు, తెలుగుదేశం నేతలు నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, టిడిపి కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త నారా లోకేష్, పలువురు టిడిపి నేతలు, ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.
అంతకుముందు ఎన్టీఆర్ కుమారుడు, తెలుగుదేశం పార్టీ నేత హరికృష్ణ, ఆయన కుమారుడు, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కోరారు. తెలుగు ప్రజలు ఒక్కటిగా ఉండాలని ఎన్టీఆర్ ఆశించారన్నారు.
ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని హరికృష్ణ అన్నారు. పేదవాడికి పట్టెడు అన్నం, మహిళలకు భద్రత కల్పించాలని అన్నారు.
ఎన్టీఆర్ కూతురు, భారతీయ జనతా పార్టీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి, వెంకటేశ్వరరావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేశారు. సినీ దర్శకుడు వైవిఎస్ చౌదరి తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళుర్పించారు.

నివాళి
ఎన్టీఆర్ 92వ జయంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద గురువారం ఉదయం ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, పలువురు ప్రముఖులు, తెలుగుదేశం నేతలు నివాళులర్పించారు.

నివాళి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, టిడిపి కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త నారా లోకేష్, పలువురు టిడిపి నేతలు, ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.

నివాళి
అంతకుముందు ఎన్టీఆర్ కుమారుడు, తెలుగుదేశం పార్టీ నేత హరికృష్ణ, ఆయన కుమారుడు, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు.

చంద్రబాబు
ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కోరారు. తెలుగు ప్రజలు ఒక్కటిగా ఉండాలని ఎన్టీఆర్ ఆశించారన్నారు.

చంద్రబాబు
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేస్తున్న చంద్రబాబు.

చంద్రబాబు
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పిస్తున్న చంద్రబాబు, బాలకృష్ణ.

చంద్రబాబు
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి వికలాంగుడికి తినిపిస్తున్న చంద్రబాబు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications