రెండంకెల వృద్ధి: ఎయిర్‌టెల్ సీఈవోతో బాబు(పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రెండంకెల వృద్ధి రేటుతో ప్రగతిపథంలో పయనించేలా బ్యాంకులు సహకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో సంపద సృష్టికి దోహదపడేలా రుణాలివ్వాలని కోరారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ముఖ్యంగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా రుణ పరిమితిని పెంచాలని సూచించారు. ఈ రంగాల ప్రగతితోపాటు ఉపాధి అవకాశాలూ పెరుగుతాయని చెప్పారు.

బ్యాంకర్స్ మీటింగ్
ఈ ఏడాది 36 శాతం తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ వ్యవసాయ రంగంలో 5.95 శాతం వృద్ధిని సాధించగలిగామని, వచ్చే ఏడాదికి 15 శాతం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఆహార అలవాట్లలో గణనీయ మార్పులవల్ల మాంసం, చేపలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందన్నారు. అలాగే ఉద్యాన, డెయిరీ, మత్స్య తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.

బ్యాంకర్స్ మీటింగ్
పోలవరం ప్రాజెక్టు ప్రయోజనాలను నాలుగేళ్లు ముందుగా రైతులకు అందించడం కోసమే పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టామని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో బిందు, సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. ఖరీఫ్, రబీలలో పంట రుణాలను సకాలంలో అందించాలని కోరారు.

ఎయిర్ టెల్ సీఈవో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో ఎయిర్ టెల్ సీఈవో వెంకటేష్.

చంద్రబాబుతో పంజాబ్ స్పీకర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో పంజాబ్ సభాపతి చరణ్ జిత్ సింగ్ అత్వాల్.












Click it and Unblock the Notifications