వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భువనేశ్వరి ఇవ్వాల్సింది గాజులు కాదు!: చంద్రబాబుపై డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి విమర్శలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాజధాని ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి భయం పట్టుకుందని అన్నారు. అందుకే ఇంట్లోని ఆడవాళ్లను తెచ్చి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

భువనేశ్వరితో కలిసి చంద్రబాబు..

భువనేశ్వరితో కలిసి చంద్రబాబు..

చంద్రబాబు నాయుడుతోపాటు ఆయన సతీమణి కూడా రాజధాని రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. బుధవారం రాజధాని ప్రాంత రైతులను కలిసి వారికి సంఘీభావం తెలిపారు. అంతేగాక, నారా భువనేశ్వరి తన గాజులను రాజధాని రైతులకు విరాళంగా ఇచ్చారు. రాజధాని రైతులకు మద్దతు పలికిన చంద్రబాబు.. ఏపీ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాజధాని రైతులకు అన్యాయం చేయొద్దని అన్నారు.

భువనేశ్వరి ఇవ్వాల్సింది గాజులు కాదంటూ..

భువనేశ్వరి ఇవ్వాల్సింది గాజులు కాదంటూ..

ఈ నేపథ్యంలో సచివాలయంలో బుధవారం డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. భువనేశ్వరి ఇవ్వాల్సింది గాజులు కాదు.. ఆమె భర్త అన్యాయంగా తీసుకున్న భూములని అన్నారు. రాజధాని‌లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరులో భూములు కొట్టేసింది మీ భర్త కాదా అంటూ భువనేశ్వరిని ప్రశ్నించారు.

ఉత్తరాంధ్ర, సీమకు వ్యతిరేకమా?

ఉత్తరాంధ్ర, సీమకు వ్యతిరేకమా?


హెరిటేజ్ పేరుతో రాజధానిలో ఉన్న భూములపై భువనేశ్వరి లెక్కలు చెప్పాలని డిప్యూటీ సీఎం డిమాండ్ చేశారు. హెరిటేజ్ పేరుతో ఉన్న 14 ఎకరాల భూములను రైతులకు ఇచ్చేయాలని అన్నారు. టీడీపీ నేతల 4వేల ఎకరాలు దోచేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. అంతేగాక, ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదన్న డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి.. చంద్రబాబు, భువనేశ్వరి ఈ ప్రాంతాల అభివృద్ధికి వ్యతిరేకమా? అని ప్రశ్నించారు.

ఒక్క ఛాన్స్ ఇస్తే నాశనం చేస్తున్నారంటూ చంద్రబాబు..

ఒక్క ఛాన్స్ ఇస్తే నాశనం చేస్తున్నారంటూ చంద్రబాబు..

చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరితో కలిసి బుధవారం రాజధాని రైతులను కలిశారు. రాజధాని కోసం వారు చేస్తున్న ఆందోళనలకు మద్దతు తెలిపారు. నమ్మొద్దు అని ఎంత చెప్పినా వినకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేసి అధికారంలోకి తీసుకొచ్చారని.. ఇప్పుడు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని చంద్రబాబు ప్రజలు, రైతులతో వ్యాఖ్యానించారు. ఏదైమైనా తాను రాజధాని రైతులకు అండగా ఉంటానని అన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని.. అమరావతి రాజధానిని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు కూడా స్వాగతించారని చెప్పారు. ఇప్పుడు మూడు రాజధానులంటూ జగన్ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు.

English summary
TDP chief Chandrababu Naidu, his wife Bhuvaneswari are against uttarandhra and Rayalaseema, asks Pushpa Srivani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X