చొక్కానలగకుండా రాజకీయం, ఆదుకోండి: కిరణ్‌పై బాబు

వర్షాల వల్ల నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.50వేలు, ఇళ్లు కోల్పోయిన వారికి రూ.1.50 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని సూచించారు. రైతులకు రుణమాఫీ చేయాలన్నారు.
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పెంపుడు కుక్కలను ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు వంటి దొంగలను ప్రోత్సహిస్తున్నారన్నారు. సోనియా అండతోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సభకు రైళ్లు వచ్చాయని విమర్శించారు. వరదలపై ప్రధానమంత్రి ఎందుకు స్పందించలేదో చెప్పాలన్నారు.
16 జిల్లాల్లో రైతులు నష్టపోయారు: కిరణ్
ప్రకాశం జిల్లాలో వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం ఉదయం పర్యటించారు. చీరాలలో ముంపునకు గురైన ఇళ్లను కిరణ్ పరిశీలించారు. వెంట కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఉన్నారు. కిరణ్ పర్చూరి మార్కెట్ యార్డులో విలేకరులతో మాట్లాడారు.
వర్షాల వల్ల పదహారు జిల్లాల్లో రైతులు నష్టపోయారని చెప్పారు. వరద బాధితులను ఆదుకుంటామని, కేంద్రం నుంచి వచ్చే సాయాన్ని కూడా బాధితులకు అందజేస్తామన్నారు. కాల్వలకు పండిన గండ్లను వెంటనే పూడ్చాలని అధికారులను ఆదేశించారు. కాగా పనబాకకు వ్యతిరేకంగా ప్రజలు సమైక్యనినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications