వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక జిల్లాకో మినీ మహానాడు- అనకాపల్లిలో చంద్రబాబు -జగన్ సర్కార్ పై తిరుగుబాటుకు పిలుపు

|
Google Oneindia TeluguNews

అనకాపల్లి జిల్లాలో రెండురోజుల టూర్ కోసం వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు అనకాపల్లిలో నిర్వహించిన మినీమహానాడులో పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్పూర్తి, చంద్రన్న భరోసా పేరుతో నిర్వహిస్తున్న మినీ మహానాడులకు చంద్రబాబు ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా వైసీపీ పాలనపై, సీఎం జగన్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు బాధితులైన వారంతా తిరుగుబాటుకు సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

చంద్రబాబు ప్రసంగం

చంద్రబాబు ప్రసంగం

అందరూ ఇబ్బందుల్లో ఉన్నారని, అందరికీ సమస్యలు వచ్చాయని, ఆర్ధికంగా చితికిపోయారని చంద్రబాబు అన్నారు. ప్రజలకు మేలు చేయడానికి ప్రభుత్వం వచ్చిందని, కానీ జగన్ సర్కార్ జనాల్ని బెదిరిస్తోందన్నారు. ఎన్డీఆర్ పెట్టిన టీడీపీ జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా బెబ్బులి పులిలా గాండ్రిస్తుందని చంద్రబాబు హెచ్చరించారు.

చోడవరం సభతో వైసీపీ సర్కార్ పతనం ప్రారంభమైందన్నారు. ఈ మూడేళ్లలో ఏ ఒక్కరికైనా ఉద్యోగం పచ్చిందా అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ దొంగల్ని హెచ్చరిస్తున్నానని, మీరు జాగ్రత్తగా ఉండకపోతే శాస్తి చేసి సత్తా ప్రజలకు ఉందన్నారు.

జిల్లాకో మహానాడు

జిల్లాకో మహానాడు

ఇలాంటి మహానాడుల్ని ప్రతీ జిల్లాలోనూ పెడతామని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ ను నెమరువేసుకుందామని, టీడీపీ చేసిన పనుల్ని జ్ఞాపకం చేసుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ తెలుగువారి కోసం పెట్టిన పార్టీ అని, తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎక్కడున్నా పోరాడతామన్నారు. టీడీపీ ఏమిచ్చింది, రాష్ట్రానికి ఏమి తెచ్చిందో ఆలోచించాలని ప్రజల్ని చంద్రబాబు కోరారు. జిల్లాల్లో 15 రోజులకో మహానాడు పెడతామని, అందులో స్ధానిక సమస్యలపై చర్చిస్తామన్నారు.

 బీసీలకు పదవులు

బీసీలకు పదవులు

బీసీలకు రాజకీయాల్లో గుర్తింపు తెచ్చింది ఎన్టీఆరే అని, సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదని చంద్రబాబు వైసీపీని ఉద్దేశించి అన్నారు. బీసీలైన అయ్యన్నపాత్రుడు, సత్యనారాయణమూర్తికి పదవులు ఇచ్చామని, ఎర్రన్నాయుడిని కేంద్రమంత్రి చేశామని చంద్రబాబు గుర్తు చేసారు. ఇవాళ ఉత్తరాంధ్రలో ఎవరు పెత్తనం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏ2 విశాఖను దోచేశాడని చంద్రబాబు తెలిపారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, వైసీపీకి భయం పుట్టుకుందన్నారు. విశాఖను రాజధాని చేస్తానన్న జగన్.. ఒక్క తట్ట మట్టి ఎత్తలేదన్నారు.

రాష్ట్రం రోడ్లపై

రాష్ట్రం రోడ్లపై

చోడవరానికి వచ్చిన రోడ్లు ఎలా ఉన్నాయో చూడాలని చంద్రబాబు తెలిపారు. కనీసం రోడ్లలో గుంతలకు రోడ్లు వేయలేని సీఎం జగన్ మూడు రాజధానులు కడతారా అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఎప్పుడూ చెత్తమాటలు, ఫేక్ న్యూస్ మాట్లాడతారన్నారు. కిలోమీటరుకు 150 గుంతలున్నాయన్నారు. ఆటోడ్రైవర్లందరూ కోపంగా ఉన్నారన్నారు. రిపేర్లకే వచ్చే ఆదాయం సరిపోతుందన్నారు. పెట్రోల్, డీజిల్ పెరిగాయి, రోడ్లు గుంతలు కూడా పూడ్చరని చంద్రబాబు విమర్శించారు. అదే టీడీపీ హయాంలో రోడ్లపై గుంతలు ఉండేవా అని ప్రశ్నించారు.

 క్రాప్ హాలిడేలపై

క్రాప్ హాలిడేలపై

ఏ రైతు అయినా ఆనందంగా ఉన్నాడా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రమంతా క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారని తెలిపారు. సుందరమైన కోనసీమలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారని, కానీ దానికీ టీడీపీయే కారణమని విమర్శించారని చంద్రబాబు గుర్తుచేశారు. ఇప్పుడు సీఎం ఊరు కడపలోనూ క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారన్నారు. రైతులకు ఇన్సూరెన్స్ ఇచ్చారని చెప్పుకుంటారని, కానీ ఎవరికీ రాలేదన్నారు. మద్దతుధరకు 3500 కోట్లు పెట్టినట్లు చెప్పారని, కానీ అదంతా తప్పుడు ప్రచారమేనన్నారు. ప్రజల కష్టార్జితం జగన్ తన పేపర్, టీవీ సాక్షికి ఇస్తున్నారన్నారు.

పదో తరగతి ఫలితాలపై

పదో తరగతి ఫలితాలపై

పదో తరగతి పరీక్షల్లో ఫలితాలు చూస్తే అమ్మఒడి, నాడు నేడు ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. టీచర్లను బ్రాందీ షాపుల దగ్గర నిలబెట్టినప్పుడే అంతా అయిపోయిందన్నారు. అడిగితే గుజరాత్ లోనూ అలాగే ఉందని చెప్తున్నారన్నారు. మొత్తం విద్యావ్యవస్ధను నాశనం చేశారని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ హయాంలో ఐటీ ఉద్యోగాలు వచ్చాయని, కానీ ఇప్పుడు ఏ ఉద్యోగమూ రావడం లేదన్నారు. జగన్ కేవలం వాలంటీర్ల ఉద్యోగాలు ఇచ్చారని, కానీ వారికి 5 వేలు ఇస్తున్నారన్నారు. ఈ సీఎం ఉన్నంతవరకూ రాష్ట్రంలో ఎవరూ పెట్టుబడులు పెట్టి ఉద్యోగులు ఇచ్చేందుకు ముందుకు రారని చంద్రబాబు ఆక్షేపించారు. రాష్ట్రంలో ఇంటికో యువకుడు ముందుకు రావాలని, జగన్ ను ఇంటికి పంపే వరకూ పోరాడాలన్నారు. క్విట్ జగన్-సేవ్ ఆంధ్రప్రదేశ్ అని పిలుపునిచ్చారు.

బాదుడే బాదుడు

బాదుడే బాదుడు

రాష్ట్రంలో గత 40 ఏళ్ల చరిత్రలో ఇంత భారీగా బాదుడు తాను చూడలేదని చంద్రబాబు ఆరోపించారు.. మీరెవరైనా చూశారా అని ప్రజల్ని ప్రశ్నించారు. మధ్యంలో సొంత బ్రాండ్లు తీసుకురావొచ్చని తానెప్పుడీూ అనుకోలేదన్నారు. జగన్ జే బ్రాండ్ తెచ్చారన్నారు. మద్యం తయారీ మీకే కావాలని, పంపిణీ మీరే చేస్తారని, ఆన్ లైన్ పేమెంట్లు కూడా చేయనివ్వడం లేదని, దీని బట్టి ఇందులో రహస్యం ఏంటో తెలుస్తోందన్నారు.

జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి 29 మంది చనిపోతే అవి సహజమరణాలు అంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ ది ఐరన్ లెగ్ అని, ఎక్కడ కాలు పెడితే అక్కడ మటాష్ అన్నారు. రాష్ట్రంలో నిత్యావసర సరకుల ధరలన్నీ పెరిగిపోయాయన్నారు. అన్ని పన్నులు పెంచారని, చెత్త పన్ను కూడా వేస్తున్నారన్నారు.

తిరుగుబాటుకు సమయమొచ్చింది..

తిరుగుబాటుకు సమయమొచ్చింది..

రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ నిస్సహాయంగా ఉన్నారని, అడిగితే చాలు కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. నర్సీపట్నంలో ఎస్సీ డాక్టర్ సుధాకర్ మాస్కు అడిగారని కేసులు పెట్టి వేధించి ప్రభుత్వం చంపేసిందన్నారు. ఆస్పత్రుల్లో కరెంటు లేక చీకటిలో సెల్ ఫోన్లు పెట్టి ఆపరేషన్లు చేస్తున్నారన్నారు. ఆరుగురు మాజీ మంత్రుల్ని అరెస్టు చేశారని, 60 మంది ప్రజాప్రతినిధులపై కేసులు పెట్టారని, ఎస్సీలు, బీసీల్ని హింసిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వమే హింసను ప్రోత్సహిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు.

వివేకానందరెడ్డిది గుండెపోటా గొడ్డలి పోటా అనేది ప్రజలకు తెలుసన్నారు. జగన్ ఇప్పటికైనా అది గొడ్డలిపోటని ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. బాబాయిని చంపినవాడు నిన్నూ నన్నూ వదిలిపెడతాడా అని అడిగారు. సీబీఐపైనా కేసులు పెడుతున్నారని, సీబీఐ పారిపోతుందేమో కానీ టీడీపీ పారిపోదన్నారు.

English summary
tdp chief slams ys jagan and his rule in mini mahanadu conducted in anakapalli today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X