దోపిడీ ప్రభుత్వంపై తిరుగుబాటు చెయ్యండి: కుప్పం పర్యటనలో ప్రజలకు చంద్రబాబు పిలుపు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రెండవ రోజు కూడా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతున్నారు. చిత్తూరు జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమలను హస్తగతం చేసుకొని వైసిపి నాయకులు దోచుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. త్వరలోనే వైసీపీ నాయకుల ఆట కట్టిస్తామని పేర్కొన్న చంద్రబాబు ప్రజలు తిరుగుబాటు చేసే రోజు తొందరలో వస్తుందంటూ వ్యాఖ్యానించారు.

రెండోరోజు కుప్పం పర్యటనలో వైసీపీపై చంద్రబాబు ధ్వజం
పన్నులతో దోచుకుంటున్న ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.రెండో రోజు పర్యటనలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తొలుత లక్ష్మీపురం లో పార్టీ జెండాను ఆవిష్కరించి అక్కడి నుండి వరదరాజస్వామి ఆలయం వరకు పాదయాత్ర చేశారు. వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన సామగుట్ట పల్లెకు వెళ్ళారు. సామగుట్ట పల్లెలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు.

వైసీపీ పాలనలో రౌడీయిజం పెరిగిపోయిందన్న చంద్రబాబు
వైసిపి పాలనలో రౌడీయిజం పెరిగిపోయిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎవరి ప్రాణాలకు భద్రత లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కరెంటు చార్జీలను, ఆర్టీసీ ఛార్జీలను కూడా పెంచిందని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.సామ గుట్ట పల్లెలో పొలాల్లోకి వెళ్లి రైతులను పలకరించిన చంద్రబాబు రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పొలాల్లో రైతులు దగ్గరికి వెళ్లి వారి సమస్యలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు మద్దతు ధర కల్పిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. వైసీపీ సర్కార్ పాలన అరాచక పాలన అని మదిపడిన చంద్రబాబు ప్రజల నుండే ప్రభుత్వంపై వ్యతిరేఖత త్వరలో పెల్లుబుకుతుందని స్పష్టం చేశారు.

రెండో రోజూ కుప్పంలో కొనసాగిన ఫ్లెక్సీల చించివేత రగడ
కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటన లో ఫ్లెక్సీల రగడ చోటు చేసుకుంది. గుడిపల్లి మండలం గుంజ రాళ్ళపల్లి వద్ద ఏర్పాటు చేసిన టిడిపి ఫ్లెక్సీలను గుర్తుతెలియని దుండగులు చించివేశారు. ఇక మండల కేంద్రమైన శాంతిపురం లోనూ టిడిపి ఫ్లెక్సీలను చించేశారు . శుక్రవారం రోజు కూడా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సమీపంలో లక్ష్మీపురం వద్ద టిడిపి బ్యానర్లను గుర్తుతెలియని దుండగులు చించివేశారు. దీనికి ప్రతీకారంగా టిడిపి కార్యకర్తలు వైసిపి బ్యానర్లను చించివేశారు. వైసిపి నేతలు టీడీపీ బ్యానర్ల చించివేతకు పాల్పడ్డారని టీడీపీ శ్రేణులు విమర్శించారు. దీంతో శుక్రవారం రోజు కుప్పంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది.

చంద్రబాబు కుప్పం పర్యటనలో ఫ్లెక్సీల చించివేతపై టీడీపీ నేతల ఆగ్రహం
టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కర్ణాటక సరిహద్దు నుండి రాళ్ళబుదుగూరు వరకు దాదాపు ముప్పై బ్యానర్లను చించి వేయడంపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కూడా చంద్రబాబు పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో టీడీపీ ఫ్లెక్సీల చించివేత రగడ మరోమారు కొనసాగింది. అంతకు ముందు టీడీపీ ముఖ్యనేతలతో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. నియోజకవర్గ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికలు తదితర అంశాలపై చంద్రబాబు చర్చించారు.కుప్పంలో ఇటీవల ఎన్నికల వరుస వైఫల్యాల నేపధ్యంలో నిరాశలో ఉన్న తెలుగు దేశం పార్టీ శ్రేణులకు చంద్రబాబు పర్యటన నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది.
-
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
ఏపీలో గ్యాస్ కొరతపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ












Click it and Unblock the Notifications