సోనియా సిఎం హామీ, షర్మిల ఓదార్పు: జగన్, టి పైనా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెసు పార్టీలో ఉన్నప్పుడు తాను చేపడుతున్న ఓదార్పు యాత్రను మానుకుంటే తొలుత కేంద్రమంత్రి పదవి ఇస్తానని, ఆ తర్వాత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పారని జగన్ చెప్పారు.
ఆదివారం ఆయన పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తాను పదవీ కాంక్షతో రాజకీయాలు చేయడం లేదన్నారు. ఓదార్పు సమయంలోనే తనకు సోనియా కేంద్రమంత్రి పదవి.. ఆ తర్వాత సిఎం పదవి ఇస్తానని చెప్పారన్నారు. ప్రతి పేదవాడి ఇంట్లో వైయస్, తన ఫోటోలు ఉండేలా తాను పాలిస్తానని చెప్పారు.

రాష్ట్రాన్ని విడగొట్టారు కానీ మనుషులను మాత్రం విడగట్టలేరన్నారు. తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధికి బాధ్యత తనదే అన్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు జాతీయ హోదా కోసం కృషి చేస్తానని చెప్పారు. వ్యవస్థల్లో అత్యున్నతస్థాయి పారదర్శకత పాటిస్తామన్నారు.
సీమాంధ్ర ప్రాంతంలో రాష్ట్రం మధ్యలో అన్ని ప్రాంతాలకు అందుబాటులో కొత్త రాజధాని ఉండాలన్నారు. భూమి, నీరు వంటి వనరులు విస్తారంగా ఉండాలన్నారు. కొత్త రాజధాని పేరులోనే సీమ, ఆంధ్ర వచ్చేలా ఉంటుందన్నారు. తాను చేపట్టిన ఓదార్పు యాత్రను షర్మిల కొనసాగిస్తారని చెప్పారు. ఇన్నాళ్లు చంద్రబాబు కాంగ్రెసు పార్టీతో అంటకాగారని, అందుకే బలం లేకున్నా కిరణ్ ప్రభుత్వం కొనసాగిందన్నారు. అందుకు టిడిపి విప్ కారణమన్నారు.












Click it and Unblock the Notifications