వేళ కాదు: పవన్‌పై బాబు, జగన్‌కు మేలు: కాపునాడు

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెట్టబోయే రాజకీయ పార్టీపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రతిస్పందించారు. తెలుగు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని, ఇది కొత్త ప్రయోగాలకూ రాజకీయాలకు సమయం కాదని ఆయన గురువారంనాడు అన్నారు. సుస్థిర పాలన ఉంటేనే తెలుగు ప్రజల అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. తమ పార్టీ మాత్రమే సుస్థిర పాలనను అందిస్తుందని చంద్రబాబు అన్నారు. ప్రజలు తమ పార్టీనే సుస్థిరత కోసం ఎన్నుకోవాలని ఆయన అన్నారు.

Pawan - babu

పార్టీలో చేరిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావుపై పార్టీ నాయకుడు అయ్యనపాత్రుడు చేసిన వ్యతిరేక వ్యాఖ్యలపై కూడా చంద్రబాబు స్పందించారు. అయన్నపాత్రుడు బహిరంగంగా మాట్లాడడం సరి కాదని, ఏదైనా ఉంటే తనతో చెప్పాలని ఆయన అన్నారు. తెలంగాణకు త్వరలో కమిటీ వేస్తానని, అవసరమైతే సీమాంధ్రకు కూడా కమిటీ వేస్తామని చెప్పారు.

ఎపి కాపునాడు ప్రతినిధులు గురువారంనాడు చంద్రబాబును కలిశారు. తెలుగుదేశం పార్టీకి వారు మద్దతు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మేలు జరుగుతుందని, దానివల్ల కాపులకు చెడు జరుగుతుందని వారన్నారు. కాపులకు అన్యాయం జరగకుండా పవన్ కళ్యాణ్ చూడాలని వారు కోరారు.

గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి వైయస్ రాజశేఖర రెడ్డికి ప్రయోజనం చేకూర్చి పెట్టారని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే వైయస్ జగన్‌కు మేలు జరిగే అవకాశం ఉందని వారన్నారు. కాపులకు అన్యాయం జరిగితే ఎవరినైనా ఎదిరిస్తామని వారన్నారు.

టిడిపిలోకి మాకినేని

గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో ఆయన గురువారంనాడు టిడిపిలో చేరారు. ఎన్టీ రామారావు ఆహ్వానం మేరకు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 1983 నుంచి ప్రత్తిపాడు శాసనసభా నియోజకవర్గం నుంచి ఆరుసార్లు పోటీ చేసి ఐదు సార్లు విజయం సాధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+