రజనీ రోబో యాక్టివ్ కానీ, మోడీ డైనమిక్ లీడర్: బాబు

నల్గొండ: ఆడబిడ్డలు మీకు అన్నం పెడుతున్నారా.. అయినా వారిని అని ఏం లాభం.. కాంగ్రెసు పార్టీ హయాంలో నిత్యవసర ధరలు బాగా పెరిగిపోయాయని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రజనీకాంత్ రోబో యాక్టివ్‌గా ఉంటుందని, సోనియా రోబో మాత్రం అలా ఉండదన్నారు. ఆయన ఆదివారం నల్గొండ జిల్లా దేవరకొండ సభలో మాట్లాడారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అంతా తాము చేసిందేనన్నారు.

హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, కన్వెన్షన్ సెంటర్, చుట్టూ అవుటర్ రింగు రోడ్డు తాము చేపట్టినవేనన్నారు. హైదరాబాద్ చుట్టూ 160 కిలోమీటర్ల అవుటర్ రింగు రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించడం తమ దూరదృష్టికి నిదర్శనమన్నారు. జాబు రావాలంటే టిడిపి ఇక్కడ, కేంద్రంలో మోడీ రావాలని చెప్పారు.

Chandrababu compares PM as Rajni Robo

తాము అధికారంలోకి వస్తే నల్లగొండ జిల్లాలో జ్యూస్ ఫ్యాక్టరీలు పెట్టించి బత్తాయికి గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని గతంలో తాను చెప్పిన మాటలే నిజమయ్యాయన్నారు. తెలంగాణలో నిరంతరాయంగా విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు.

జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశారని కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. తమ హయాంలో తెలంగాణలో అదనంగా 20లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. సోనియా అవినితి అనకొండ అని నిప్పులు చెరిగారు. తమ హయాంలో అగ్రభాగం తెలంగాణకో ఖర్చు పెట్టామన్నారు.

మొద్దబ్బాయ్, దొంగబ్బాయ్‌లను ఇరు ప్రాంతాల్లోను ఆమోదించవద్దన్నారు. వైయస్ రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని నిప్పులు చెరిగారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ డైనమిక్ లీడర్ అన్నారు. తెరాస వసూళ్ల పార్టీ అని ధ్వజమెత్తారు. మోడీ, తనది అభివృద్ధి జంట అయితే, కాంగ్రెసుది అవినీతి జంట అన్నారు. హైటెక్ సిటీని, సైబర్ టవర్స్‌ను నిర్మించింది తామే అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+