ఆహుతి ప్రసాద్ మృతి: చంద్రబాబు, మురళీ మోహన్ సంతాపం
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు ఆహుతి ప్రసాద్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు అన్నారు. ఆహుతి ప్రసాద్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
సినీ నటుడిగానే కాకుండా మా ప్రధాన కార్యదర్శిగా ఆహుతి ప్రసాద్ సేవలు మరిచిపోలేనివని తెలుగుదేశం పార్టీ నేత, రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు, నటుడు మురళీ మోహన్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అతని సేవలు చిరస్మరణీయమన్నారు.
Deepest condolences on the passing of versatile Telugu actor Aahuti Prasad. Every character he played was different & intense. RIP.
— N Chandrababu Naidu (@ncbn) January 4, 2015 ఆహుతి ప్రసాద్ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చారు. మద్రాసు ఫిలిం ఇనిస్టిట్యూట్లో శిక్షణ పొందారు. చిరంజీవి, రజనీకాంత్, రాజేంద్ర ప్రసాద్, నారాయణ రావు తదితరులను స్ఫూర్తిగా తీసుకున్నారు. ఫిలిం ఇనిస్టిట్యూట్లో శిక్షణ ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. 1984లో తన డిప్లోమా పూర్తి అయ్యాక మద్రాసు వెళ్లారు.

అక్కడ దేవదాస్ కనకాల ఓ యాక్టింగ్ స్కూల్ పెట్టి దానికి ఇంఛార్జిగా ఉండమని కోరడంతో బాధ్యతలు తీసుకున్నారు. ఆ ఇనిస్టిట్యూట్‌కు తరుచూ తాతినేని ప్రకాశ రావు వచ్చేవారు. ఆయనతో ఏర్పడిన పరిచయంతో ఆహుతి ప్రసాద్ మీరూ ఆలోచించండి అనే కార్యక్రమంలో నటించేందుకు అవకాశం వచ్చింది.
ఓ సందర్భంలో రాఘవగారి అబ్బాయి పరిచయమయ్యారు. ప్రతాప్ ఆర్ట్స్ బ్యానర్లో నిర్మించిన ఈ ప్రశ్నకు బదులేది అనే సినిమాలో నటించేందుకు అవకాశం వచ్చింది. ఆహుతిలో శంభుప్రసాద్ పాత్రలో నటించారు. ఈ సినిమాతో ఆయనకు మంచి పేరు వచ్చింది. అప్పటి నుండి ఆయనను ఆహుతి ప్రసాద్‌గా పిలుస్తున్నారు.












Click it and Unblock the Notifications