డీకేటీ, పట్టా భూముల్లో ఇసుక, చంద్రబాబు కీలక నిర్ణయం, శాండ్ జాతర

ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 16వ తేదీ నుంచి అన్ని రీచ్ ల్లో ఇసుక తవ్వకాలు మొదలు కావాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, గనుల శాఖ ప్రధాన కార్యదర్శి ముకేష్ కుమార్ మీనాతో పాటు సంబంధిత అధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక సమీక్ నిర్వహించారు.

ఈ సందర్భంలో సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. నదుల్లో ఇసుక రీచ్ లు గుర్తించి, వాటికి అనుమతులు తెచ్చుకుని ఇసుక తవ్వకుంటామని ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు వస్తే వారికి అనుమతులు ఇస్తే బాగుంటుందని సంబంధిత అధికారులు సీఎం చంద్రబాబుకు మనవి చేశారు. అధికారుల సూచనలకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. అయితే ఏపీ శ్యాండ్ ఫోర్టల్, జిల్లా ఇసుక కమిటీల ద్వారానే ప్రైవేట్ వ్యక్తులు ఇసుక అమ్ముకోవడానికి అనుమతులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.

Chandrababu conducted a review with the officials of the Department of Mines and issued orders

ఇసుక రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చెయ్యాలని, ఆ జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా గ్రామ సచివాలయాల సిబ్బంది ఎప్పటికప్పుడు ఇసుక కొనుగోలుదారులకు వివరాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఇసుకకు నామమాత్రపు ధర మాత్రమే తీసుకోవాలని, ఇసుకను అక్రమ దారిలోకి మళ్లించకుండా చూసుకునే బాధ్యత మీదే అని సంబంధిత అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

నదుల్లో ఇసుక రీచ్ లు గుర్తించిన ప్రైవేట్ వ్యక్తులు వస్తే వారికి అనుమతి ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే డీకేటీ, పట్టా భూముల్లో కూడా ఇసుక తవ్వుకుని విక్రయించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే అనుమతి ఇవ్వనుంది. ఇసుక రీచ్ ల్లో ఇసుక అందుబాటులో ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సంబందిత అధికారులకు సూచించారు.

Chandrababu conducted a review with the officials of the Department of Mines and issued orders

డీకేటీ, పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు జరిగితే నిత్యం లక్ష టన్నుల ఇసుక అందుబాటులో ఉంటుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎంతో సమావేశమైన గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, గనుల శాఖ ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు త్వరలోనే ప్రైవేట్ వ్యక్తులు డీకేటీ, పట్టా భూముల్లో ఇసుక తొవ్వుకోవడానికి త్వరలోనే అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+