వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేము ఊస్తే గాల్లోకే: రోడ్‌షోలో కెసిఆర్‌పై బాబు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

కృష్ణా/వరంగల్: వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీల్లో ఎమ్మెల్యే, ఎంపి టికెట్‌లకు.. వందకోట్ల అవినీతి, జైలు జీవితం గడిపిన చరిత్ర అర్హతలుగా మారాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. ఆయన సోమవారం వరంగల్, కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ బినామీ అని ఆరోపించారు.

తనను అనేక సభల్లో తిట్టిన కెసిఆర్.. ఏనాడైనా, ఎక్కడైనా జగన్‌ను తిట్టారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆ ఇద్దరూ తోడుదొంగలని విమర్శించారు. ‘కెసిఆర్ నోటికి హద్దూ పద్దూ లేదు.. ఇవాళ నన్ను తిడుతాడు.. రేపు మిమ్మల్ని తిడుతాడు.. చిత్తుగా తాగేసి తనకు తానే తిట్టేసుకుంటాడ'ని చంద్రబాబు ఎద్దేవా చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ని ముక్కలు, ముక్కలు చేస్తానంటున్న కెసిఆర్.. తాము ఊస్తే గాల్లోకి కొట్టుకపోతాడంటూ వ్యంగ్యంగా చంద్రబాబు విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెస్ గురించి చెప్పాలంటే.. ఏ1 నుంచి ఏ10 వరకు నేర చరితులకు అభ్యర్థులుగా టికెట్‌లు ఇచ్చి పోటీలో పెట్టారని చంద్రబాబునాయుడు జగన్‌పై విరుచుకపడ్డారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కృష్ణా జిల్లా కేంద్రంలోని గాంధీ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. హైదరాబాద్ వంటి అధునాత రాజధానిని సీమాంధ్రలో నిర్మించే బాధ్యత తనదేనని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా లక్షలాది మంది యువకులకు ఉద్యోగాలు ఇప్పించానన్నారు. అవినీతి పరుడైన వైయస్ ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్ర సంపదను కొల్లగొట్టి ఆర్థిక పరిస్థితిని చిన్నా భిన్నం చేశాడని విమర్శించారు. ప్రజల సొమ్మును దోచుకొని ఎన్నికల బరిలో నిలిచిన జగన్‌కు, కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలని కోరారు.

రోడ్‌షోలో చంద్రబాబు

రోడ్‌షోలో చంద్రబాబు

వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీల్లో ఎమ్మెల్యే, ఎంపి టికెట్‌లకు.. వందకోట్ల అవినీతి, జైలు జీవితం గడిపిన చరిత్ర అర్హతలుగా మారాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు.

మహబూబాబాద్‌లో..

మహబూబాబాద్‌లో..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ బినామీ అని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

భారీగా హాజరైన జనం

భారీగా హాజరైన జనం

తనను అనేక సభల్లో తిట్టిన కెసిఆర్.. ఏనాడైనా, ఎక్కడైనా జగన్‌ను తిట్టారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆ ఇద్దరూ తోడుదొంగలని విమర్శించారు.

జగ్గయ్యపేటలో బాబు ప్రసంగం

జగ్గయ్యపేటలో బాబు ప్రసంగం

హైదరాబాద్ వంటి అధునాత రాజధానిని సీమాంధ్రలో నిర్మించే బాధ్యత తనదేనని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు అభివాదం

చంద్రబాబు అభివాదం

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కృష్ణా జిల్లా కేంద్రంలోని గాంధీ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా లక్షలాది మంది యువకులకు ఉద్యోగాలు ఇప్పించానన్నారు.

భారీ సంఖ్యలో హాజరై. జనం

భారీ సంఖ్యలో హాజరై. జనం

అవినీతి పరుడైన వైయస్ ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్ర సంపదను కొల్లగొట్టి ఆర్థిక పరిస్థితిని చిన్నా భిన్నం చేశాడని చంద్రబాబు విమర్శించారు.

English summary
Telugudesam Party president Chandrababu Naidu on Monday campaigned in Warangal and Krishna districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X