చంద్రబాబు కాన్వాయ్ పై దాడి ఘటన: 47 మందిపై కేసులు..పలువురు అరెస్ట్

విశాఖపట్నం ప్రజా చైతన్య యాత్రకు వెళ్ళిన చంద్రబాబును అడ్డగించి ఆయన కాన్వాయ్ పై కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేసి , అయన వేణు దిరిగిపోవాలని నానా హంగామా చేసిన వారిపై ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించారు వైజాగ్ ఎయిర్ పోర్ట్ పోలీసులు . విశాఖ పట్నం పోలీసులు ఎట్టకేలకు యాక్షన్‌లోకి దిగి టీడీపీ అధినేత చంద్రబాబును విశాఖలోకి రావద్దంటూ ఆందోళన చేసిన వారిలో కొందరిని అరెస్టు చేశారు.

 చంద్రబాబు వైజాగ్ పర్యటన అడ్డగింత ఘటన .. రంగంలోకి పోలీసులు

చంద్రబాబు వైజాగ్ పర్యటన అడ్డగింత ఘటన .. రంగంలోకి పోలీసులు

ఫిబ్రవరి 27న చంద్రబాబును విశాఖలోకి రాకుండా ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారు కొందరు ఆందోళనకారులు . ఇక అక్కడ కోడిగుడ్లు, టమాటాలతో ఆయన కాన్వాయ్ పై దాడి చెయ్యటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక ఈ నేపధ్యంలో చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ వ్యవహారంలో పోలీసులు కూడా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు.మొత్తం మీద ఈ ఘటనకు బాధ్యులైన 47 మందికి పైగా నిరసనకారులపై కేసులు నమోదు చేశారు ఎయిర్ పోర్ట్ పోలీసులు.ఇందులో 35 మందికి పైగా వైసీపీ మద్దతుదారులుకాగా 11 మంది టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులపై కూడా కేసులు పెట్టారు .

వీడియో ఫుటేజ్ ఆధారంగా పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు

వీడియో ఫుటేజ్ ఆధారంగా పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఇక చంద్రబాబును అడ్డుకున్న వారిలో కొందరిని వైజాగ్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా చెప్పులు విసిరిన వారిని, ఆత్మాహుతికి యత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.చంద్రబాబు కాన్వాయ్ అడ్దగింపు వ్యవహారంలో పలువురిపై కేసునమోదు చేసిన ఎయిర్ పోర్ట్ పోలీసులు వీడియో ఫుటేజీ ఆధారంగా కొందరిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.

వైసీపీ , టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు

వైసీపీ , టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు

ఇక ఈ ఘటనలో వైసీపీ , టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. పోలీసుల అదుపులోకి తీసుకున్న వారిలో ఏపీ ప్రజాసంఘం నాయకుడు జెటి రామారావు కాన్వాయ్ పైకి ఎక్కి పెట్రోల్ పోసుకుంటానని బెదిరించారు. ఇక కోడిగుడ్లు, చెప్పులు విసిరిన వ్యవహారంలో గరికిన వెంకట్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహిళా ఎస్సై విధినిర్వహణకు ఆటంకం కలిగించినందుకు కూడా ఒకరిపై కేసు నమోదు చేశారు. . మహిళా ఎస్సైపై చేయిచేసుకుని, దుర్భాషలాడినందుకు కృప అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఈ ఘటనకు బాధ్యులైన మరికొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+