అగ్రిగోల్డ్ బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలి... పూర్తి నగదు చెల్లించాలి : చంద్రబాబు డిమాండ్
అగ్రిగోల్డ్ బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని... వారికి పూర్తి నగదు చెల్లించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను అండర్ వాల్యూకి ధారాదత్తం చేయరాదన్నారు. దశలవారీ మద్యనిషేధం పేరుతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి... ఆ మాట తప్పారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరల పెంపుపై ఈ నెల 28న టీడీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. టీడీపీ ముఖ్య నేతలతో సోమవారం(ఆగస్టు 23) జరిగిన భేటీ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.
ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు రూ.413 కోట్లు డిపాజిట్ చేశామని ఏపీ ప్రభుత్వం చెబుతోందని... కానీ ఇప్పటికీ కాంట్రాక్టర్లకు ఆ డబ్బులు అందలేదని అన్నారు. కేంద్రం రూ.1,991 కోట్లు నరేగా బకాయిలను విడుదల చేసినా.. వాటిని ఇవ్వకుండా దారి మల్లించారని ఆరోపించారు. ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని... దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అత్యాచారాలు,హత్యలకు సంబంధించి అట్రాసిటీ చట్టం దుర్వినియోగం అవుతోందని... దీనిపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని అన్నారు.

ఇదే అంశంపై వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ... చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ సంస్థకు అనుమతులు వచ్చాయని... ఆయన హయాంలోనే ఆ సంస్థ బోర్డు తిప్పేసిందని గుర్తుచేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను టీడీపీ నేతలే దోచుకున్నారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ అక్రమాలకు ప్రధాన సూత్రధారి చంద్రబాబే అని ఆరోపించారు. మధ్యతరగతి ప్రజలు తీవ్ర మనోవేదనకు గురిచేశారని... 300 మంది బాధితుల ఆత్మహత్యలకు కారకుడయ్యారని విమర్శించారు. పాదయాత్ర సమయంలోనే జగన్ అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పటికే రూ.10వేల లోపు డిపాజిట్ దారులకు డబ్బులు చెల్లించామని... ఈ నెల 24న రూ.20వేల లోపు బాధితులకు చెల్లింపులు జరుపుతున్నామని తెలిపారు.
కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు కూడా ఇదే అభిప్రాయపడ్డారు.300 మంది అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మహత్యలకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే వైఎస్ జగన్ అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారని గుర్తుచేశారు.
ఏపీలో అగ్రి గోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అగ్రి గోల్డ్ సంస్థలో రూ.20వేల లోపు డిపాజిట్ చేసిన బాధితులకు ఈనెల 24న ప్రభుత్వం ఆ సొమ్మును చెల్లించనుంది. అయితే పూర్తి సొమ్మును చెల్లిస్తారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఈ నెల 19 వరకూ 7.76లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.అగ్రి గోల్డ్ సంస్థలో రూ.10వేల లోపు డిపాజిట్ చేసినవారికి గతంలోనే ప్రభుత్వం రూ.240 కోట్లు విడుదల చేసి ఆ సొమ్మును చెల్లించింది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications